Ajay Devgn: అజయ్ దేవగన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్.. సల్మాన్, షారుఖ్ కెరీర్ లో సూపర్ హిట్స్
దాదాపు 33 ఏళ్లుగా బాలీవుడ్‌లో దూసుకుపోతున్న అజయ్ కెరీర్‌లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పీజీని లిఖించుకున్నాడు అజయ్ దేవగన్. ‘మైదాన్’ ట్రైలర్ చూస్తుంటే ఫుట్‌బాల్ కోచ్ పాత్రలోనూ జనాలకు నచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ పాత్రలో ఎంత అద్భుతంగా నటించాడనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. వాస్తవానికి అజయ్ దేవగన్ మంచి నటుడు.. కానీ స్టార్ హీరోలు అంటే ఖాన్ త్రయం గుర్తుకొస్తుంది. ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్ గతంలో తనకు వచ్చిన సినీ అఫార్లను తిరస్కరించకుండా.. ఆ సినిమాల్లో నటించి ఉంటే కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉండేవి అని ఫ్యాన్స్ అంటున్నారు
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘మైదాన్’ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. అమిత్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భారత మాజీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ పాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 33 ఏళ్లుగా బాలీవుడ్‌లో దూసుకుపోతున్న అజయ్ కెరీర్‌లో ఎన్నో గొప్ప పాత్రలు పోషించి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పీజీని లిఖించుకున్నాడు అజయ్ దేవగన్. ‘మైదాన్’ ట్రైలర్ చూస్తుంటే ఫుట్‌బాల్ కోచ్ పాత్రలోనూ జనాలకు నచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ పాత్రలో ఎంత అద్భుతంగా నటించాడనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. వాస్తవానికి అజయ్ దేవగన్ మంచి నటుడు.. కానీ స్టార్ హీరోలు అంటే ఖాన్ త్రయం గుర్తుకొస్తుంది. ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్ గతంలో తనకు వచ్చిన సినీ అఫార్లను తిరస్కరించకుండా.. ఆ సినిమాల్లో నటించి ఉంటే కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉండేవి అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ రోజు ఆ సినిమాల గురించి తెలుసుకుందాం..
వాస్తవానికి కొన్ని సినిమాల్లో నటించమంటూ మేకర్స్ ఇంతకుముందు అజయ్‌ని సంప్రదించారు. అయితే ఆ సినిమాలు చేయలేకపోయాడు. అజయ్ తిరస్కరించడంతో మరో నటుడిని తీసుకున్నారు. అజయ్ తిరస్కరించిన చిత్రాలలో షారుక్ ఖాన్-సల్మాన్ ఖాన్ లు నటించి సూపర్ హిట్ అందుకున్నారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి ఆ సినిమాలు. ఇద్దరు ఖాన్‌లు తెరపై అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం
పద్మావతి: దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతికి సినిమా 2018 సంవత్సరంలో విడుదలైన సూపర్ హిట్ అందుకుంది. ఈ చిత్రంలో రాణి పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రను షాహిద్ పోషించాడు. నివేదికల ప్రకారం ఈ పాత్రను మొదటిగా అజయ్ దేవగన్‌కు ఆఫర్ చేశారు. అయితే అజయ్ దేవగన్ తిరస్కరించాడు. తర్వాత షాహిద్‌ను ఎంపిక చేశారు.
బాజీరావ్ మస్తానీ: బాజీరావ్ మస్తానీ ఇందులో రణవీర్ సింగ్, దీపిక ప్రధాన పాత్రలు పోషించారు. బాజీరావు పాత్రలో రణవీర్, మస్తానీ పాత్రలో దీపిక నటించారు. ఈ సినిమాలో కూడా అజయ్‌నే నటింపజేయాలని మేకర్స్ భావించినట్టు సమాచారం. తనకు వచ్చిన ఈ సినిమా ఆఫర్ ను కూడా అజయ్ దేవగన్ నిరాకరించారు.
డర్: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అనగానే డర్ సినిమా గుర్తుకొస్తుంది. 1993లో విడుదలైన షారుఖ్ ఖాన్ నటించిన డర్ సినిమా.. ఇందులో షారుక్ ఖాన్ విలన్ పాత్రను పోషించి నటుడుగా ఫేమస్ అయ్యాడు. నివేదిక ప్రకారం షారుఖ్ కంటే ముందు ఈ పాత్ర మొదట ఆఫర్ అజయ్‌కు వెళ్లింది. అతను తిరస్కరించడంతో షారుక్ ఈ చిత్రంలో భాగమయ్యాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కరణ్ అర్జున్: కరణ్ అర్జున్ చిత్రంలో సల్మాన్-షారుక్ జంటను ప్రేక్షకులు మెచ్చరు. అయితే, కరణ్ పాత్ర కోసం రాకేష్ రోషన్ మొదటి ఎంపిక అజయ్ దేవగన్. అజయ్ కూడా ఈ సినిమా చేయాలనుకున్నాడని.. అయితే కరణ్ పాత్ర కంటే అర్జున్ క్యారెక్టర్ నచ్చిందని అంటున్నారు. దీనికి రాకేష్ రోషన్ నిరాకరించాడు. ఆ తర్వాత కరణ్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటించి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.
కుచ్ కుచ్ హోతా హై: బాలీవుడ్ లో స్టార్ హీరోగా షారుఖ్ ఖాన్ ను నిలబెట్టిన మరో చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’. నివేదికల ప్రకారం రాహుల్ పాత్రకు అసలు ఎంపిక షారుక్ కాదు, అజయ్ దేవగన్. అతను అందుకు నిరాకరించడంతో షారుక్ సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..