వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో రోజుల తరబడి నిల్వ చేస్తున్నారా.. నిర్ణీత సమయం దాటితే పాయిజన్‌తో సమానం అని తెలుసా..!

కొంతమంది ఫ్రిడ్జ్ డోర్ ను ఓపెన్ చేస్తే షాక్ తినాల్సిందే.. ఎందుకంటే అందులో కూరగాయలు, పండ్లు, వండిన ఆహార పదార్ధాలు ఇలా అనేక వస్తువులు కుక్కి కుక్కి మరీ కనిపిస్తాయి. అప్పుడు ఫ్రిడ్జ్ ను సరిగా శుభ్రం చేయలేరు. ఈ కారణంగా రిఫ్రిజిరేటర్లో కీటకాలు సంతానోత్పత్తి చేయవచ్చు. ఈ కీటకాలు ఫ్రీజర్‌లో ఉంచిన ఆహారంమీదకు చేరుకోవచ్చు. ఇటువంటి ఆహారాన్ని తినడం వల్ల అనేక రకాల కడుపుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది

వండిన ఆహారాన్ని ఫ్రిడ్జ్‌లో రోజుల తరబడి నిల్వ చేస్తున్నారా.. నిర్ణీత సమయం దాటితే పాయిజన్‌తో సమానం అని తెలుసా..!
Cooked Food In The FridgeImage Credit source: Getty Images Sergey Mironov
Follow us

|

Updated on: Apr 04, 2024 | 12:37 PM

వేసవి కాలం వచ్చేసింది. ప్రజలు వండిన ఆహారం పాడవకుండా ఫ్రిజ్‌లో ఉంచడం ప్రారంభించారు. అయితే వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో ఎంతసేపు ఉంచాలి? ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచడం ఆరోగ్యానికి మంచిదా? అనే విషయాల గురించి వైద్యుల ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఆహారం పాడైపోయే అవకాశం ఉంది. కనుక వంట చేసిన తర్వాత ఆ పదార్ధాలను ఫ్రిడ్జ్ లో ఉంచుతారు. అయితే ఎక్కువసేపు ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదా కదా తెలుసుకుందాం..

కొంతమంది ఫ్రిడ్జ్ డోర్ ను ఓపెన్ చేస్తే షాక్ తినాల్సిందే.. ఎందుకంటే అందులో కూరగాయలు, పండ్లు, వండిన ఆహార పదార్ధాలు ఇలా అనేక వస్తువులు కుక్కి కుక్కి మరీ కనిపిస్తాయి. అప్పుడు ఫ్రిడ్జ్ ను సరిగా శుభ్రం చేయలేరు. ఈ కారణంగా రిఫ్రిజిరేటర్లో కీటకాలు సంతానోత్పత్తి చేయవచ్చు. ఈ కీటకాలు ఫ్రీజర్‌లో ఉంచిన ఆహారంమీదకు చేరుకోవచ్చు. ఇటువంటి ఆహారాన్ని తినడం వల్ల అనేక రకాల కడుపుకి సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కనుక ఫ్రిజ్‌ని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ ఆహారాన్ని నిల్వ చేయకూడదని గుర్తుంచుకోండి. ఎక్కువ వస్తువులు పెడితే ఫ్రిజ్‌లో గాలి సోకే ఖాళీ ఉండదు. దీని వల్ల అనేక రకాల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.

ఎంతకాలం ఆహారం నిల్వ ఉంచుకోవచ్చు అంటే

ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి ఒకొక్క ఆహారానికి ఒకొక్క సమయం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కూరగాయలను 3-4 రోజులు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచవచ్చని ఎయిమ్స్ న్యూఢిల్లీలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్ మనాలి అగర్వాల్ తెలిపారు. అదే పండ్లు అయితే ఒక వారం పాటు ఉంచవచ్చు.  గుడ్లు, మాంసం వంటి వాటిని మాత్రం రెండు రోజుల్లో తినాలి. అయితే వండిన ఆహారాన్ని మాత్రం ఐదు నుంచి ఆరు గంటలకు మించి రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు.

ఇవి కూడా చదవండి

ఆహారాన్ని వంట చేసిన గంట నుంచి 2 గంటలలోపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ సమయంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల మధ్య ఉండాలని గుర్తుంచుకోండి. తయారుచేసిన కూరలను అయితే 3 నుంచి  4 గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తినవచ్చు. కూరలను ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన తరువాత వాటిని  ముందు వేడి చేయండి. తరువాత తినవచ్చు. అలాగే వంట చేయని వాటిని, వండిన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్‌లో విడిగా ఉంచాలని గుర్తుంచుకోండి.

అనేక వ్యాధుల ప్రమాదం

ఆహారాన్ని నిర్దేశించిన సమయం కంటే ఎక్కువ సమయం ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత ఆ ఆహారాన్ని తింటే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ మనాలి అగర్వాల్ చెబుతున్నారు. చాలా సందర్భాల్లో  వండిన ఆహారం చెడిపోయినా, వాసన వచ్చినా సరే తినేస్తారు. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవ్వడమే కాదు టైఫాయిడ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ కాలం ఉంచిన ఆహారంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరగడం ప్రారంభించడం వల్ల ఇలా జరుగుతుంది. బ్యాక్టీరియా కడుపులోకి రకరకాల వ్యాధులను కలిగించే అవకాశం ఎక్కువ.

మారని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..