AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి..

శరీరంలో విటమిన్ బి లోపం వలన కలిగే అనర్థాల గురించి చాలా మందికి తెలియదు. విటమిన్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. దీని కారణంగా వారు విటమిన్ లోపం సమస్యలతో సతమతం అవుతుంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు బి-12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి 12 అనేది శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. విటమిన్ బి 12 మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. మెదడు వెన్నుపాము ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే తినే ఆహారంలో విటమిన్ బి 12 ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Women Health: మహిళలూ బీ అలర్ట్.. ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకండి..
Vitamin B12
Shiva Prajapati
|

Updated on: Sep 21, 2023 | 8:34 PM

Share

శరీరంలో విటమిన్ బి లోపం వలన కలిగే అనర్థాల గురించి చాలా మందికి తెలియదు. విటమిన్ల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. దీని కారణంగా వారు విటమిన్ లోపం సమస్యలతో సతమతం అవుతుంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు బి-12 విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి 12 అనేది శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. విటమిన్ బి 12 మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. మెదడు వెన్నుపాము ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది. అందుకే తినే ఆహారంలో విటమిన్ బి 12 ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి వివిధ విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్స్, కార్పోహైడ్రేట్స్, ఫైబర్ తగిన మొత్తంలో కలిగి ఉండటం కూడా చాలా అవసరం. మనం ఆహారం ద్వారానే శరీరానికి అవసరమైన చాలా పోషకాలు పొందుతాం. ఇందులో విటమిన్లు ఒకటి. ఇవి శరీరానికి చాలా ముఖ్యమైనవి. అయితే, సాధారణ ఆహారంలో ఇది తగినంత పరిమాణంలో ఉండదు. దీని కారణంగా చాలా మంది మహిళల్లో బి12 విటమిన్ లోపం ఉంటుంది.

విటమిన్ B-12 శరీరానికి ఎందుకు ముఖ్యమైనది?

అనేక ఇతర విటమిన్ల మాదిరిగానే.. విటమిన్ B-12 కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. విటమిన్ B-12 మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా చర్మాన్ని మృదువుగా, అందంగా చేస్తుంది. విటమిన్ B-12 సరైన మొత్తంలో తీసుకుంటే.. జుట్టు బలంగా మారుతుంది. రక్త లోపం ఉండదు. దీంతో పాటు ఇది శరీరంలోని జీవక్రియను కూడా పెంచుతుంది. విటమిన్ బి రొమ్ము, కొల్లాజెన్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ బి12 లోపం ఉన్న మహిళలు.. ఆ లోపాన్ని సెట్ చేసుకోవడానికి వివిధ రకాల సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, మాంసం, చేపలు సహా వివిధ రకాల శాఖాహార పదార్థాలను తినడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని భర్తీ చేయొచ్చు.

గర్భిణీ స్త్రీలలో విటమిన్ బి 12 లోపం వల్ల కలిగే నష్టాలు..

నవజాత శిశువు అభివృద్ధిలో తల్లి శరీరంలో విటమిన్ B12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గర్భిణీ స్త్రీల శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉన్నట్లయితే.. శిశువు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, నరాల సమస్యలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ మొదలైన అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. అందువల్ల, గర్భిణీ స్త్రీలు తమ వైద్యుడిని సంప్రదించి విటమిన్ B12 లోపం ఉన్న సందర్భాల్లో సంబంధిత చికిత్సను అనుసరించాలి.

విటమిన్ B-12 వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి?

  1. విటమిన్ B-12 శరీరానికి చాలా ముఖ్యమైనది. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
  2. ఎర్ర రక్త కణాల అభివృద్ధిలో విటమిన్ B-12 చాలా కీలకమైంది.
  3. విటమిన్ B-12 గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  4. విటమిన్ B-12 అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  5. విటమిన్ B-12 శక్తిని పెంచుతుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది.
  6. రీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

విటమిన్ B-12 లోపం లక్షణాలు..

1. అలసట, ఒత్తిడి.

2. కడుపు నొప్పి.

3. రక్త హీనత.

4. చర్మం పసుపు రంగులోకి మారడం.

5. బరువు తగ్గడం.

6. ఆకలి లేకపోవడం.

విటమిన్ B-12 లోపాన్ని ఎలా అధిగమించాలి?

మీ శరీరంలో విటమిన్ B-12 లోపం ఉంటే.. దానిని భర్తీ చేయడం చాలా ముఖ్యం. ఈ బిటమిన్ లోపాన్ని భర్తీ చేయాలంటే.. పాలు, పెరుగు, చీజ్, గుడ్డు, సోయా పాలు, చికెన్ వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిని తినడం వల్ల శరీరంలో విటమిన్ బి-12 లోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ