14 రోజులు చక్కెర మానేస్తే.. శరీరంలో జరిగేది ఇదే!

Samatha

6 January 2026

చాలా మంది స్వీట్ ఎక్కువగా తింటుంటారు. అయితే స్వీట్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

స్వీట్

చక్కెర వంటకాలు చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ అధిక మొత్తంలో స్వీట్ తినడం వలన ఇది ఊబకాయం, మధుమేహం, దంత క్షయం వంటి సమస్యలకు కారణం అవుతుందంట.

చక్కెర వంటకాలు

అందువలన చక్కెరను తీసుకోవడం తగ్గించడం వలన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, ఇప్పుడు మనం చక్కెరను 14 రోజులు తీసుకోవడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ప్రయోజనాలు

మీరు ప్రారంభంలో చక్కెర తీసుకోవడం తగ్గించడం ప్రారంభించినప్పుడు, మీ శరీరం అనేది అనేక మార్పులకు లోను అవుతుందంట.

ప్రారంభంలో

ముఖ్యంగా మీ మెదడు చక్కెర లేకపోవడానికి అలవాటు పడుతుంది. కానీ ప్రారంభంలో తీపి తినాలనే కోరిక, తలనొప్పి, అలసట, చికాకు వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

తలనొప్పి, అలసట

తర్వాత క్రమంగా మీ మెదడు చక్కెర లేకపోవడానికి అలవాటు పడుతుంది. దీంతో ఆకలి తగ్గడం, శక్తి స్థాయిలు స్థిరంగా ఉండటం, ఇన్సులిన్ ప్రతి స్పందన మెరుగుపడుతుందంట.

ఇన్సులిన్ నిరోధకత

తర్వాత జీవక్రియ మెరుగుపడుతుంది. శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్సులిన్ స్పైక్‌లను తగ్గించి, కాలేయంలో చక్కెర భారాన్ని తగ్గిస్తుంది. నీటి నిలుపుదలకు సహాయపడుతుంది..

జీర్ణక్రియ

అలాగే 14 రోజుల పాటు చక్కెర మానెయ్యడం వలన  ఇది కడుపు ఉబ్బరం, కొవ్వు కాలేయం, ఇన్సులిన్ నిరోధకత, నిద్రలేమి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

కడుపు ఉబ్బరం