Weight Loss: బరువు త్వరగా తగ్గాలనుకుంటున్నారా? ఈ 8 ఫుడ్స్‌కి దూరంగా ఉంటే చాలు
బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటలు గడపడం లేదా డైట్‌లో క్యాలరీలు లెక్కపెట్టడం మాత్రమే కాదు. మీ రోజువారీ ప్లేట్‌లో దాక్కున్న ‘హిడెన్ క్యాలరీ బాంబులను’ గుర్తించడం కూడా చాలా ముఖ్యం. చాలామంది కష్టపడి వ్యాయామం చేస్తుంటారు కానీ ఈ ఒక్క ..

బరువు తగ్గడం అంటే కేవలం జిమ్‌లో గంటలు గడపడం లేదా డైట్‌లో క్యాలరీలు లెక్కపెట్టడం మాత్రమే కాదు. మీ రోజువారీ ప్లేట్‌లో దాక్కున్న ‘హిడెన్ క్యాలరీ బాంబులను’ గుర్తించడం కూడా చాలా ముఖ్యం. చాలామంది కష్టపడి వ్యాయామం చేస్తుంటారు కానీ ఈ ఒక్క చిన్న తప్పు వల్ల నెలల తరబడి ఫలితం కనిపించదు.
ఈ ఆహారాలు చిన్న మొత్తంలోనే అధిక క్యాలరీలు, ట్రాన్స్ ఫ్యాట్, రిఫైండ్ షుగర్ ఇస్తాయి. ఇవి శరీరంలో కొవ్వుగా నిల్వ ఉంటాయి. వీటిని తగ్గిస్తేనే క్యాలరీ డెఫిసిట్ సులువుగా సాధ్యమవుతుంది, బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది. బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ 8 ఆహారాలకి దూరంగా ఉండండి!
1. ఫ్రెంచ్ ఫ్రైస్ & పొటాటో చిప్స్
ఒక మీడియం సర్వింగ్ (150 గ్రాములు)లోనే 400–550 క్యాలరీస్ ఉంటాయి. ఇవి డీప్ ఫ్రై చేసినవి కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ. ఒక్కసారి తింటే రెండు రోజుల వ్యాయామం వేస్ట్ అవుతుంది.
2. సోడా, కోల్డ్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు
ఒక 300 మి.లీ బాటిల్‌లో 140–180 ఎంప్టీ క్యాలరీస్ (అంటే పోషకాలు జీరో). రోజూ ఒకటి తాగితే నెలకి 4,000–5,000 అదనపు క్యాలరీస్, దాదాపు అర కిలో నుంచి 1 కిలో కొవ్వు పెరుగుతుంది.
3. ఐస్‌క్రీమ్
ఒక చిన్న కప్ (100 గ్రాములు)లోనే 250–350 క్యాలరీస్, 20–30 గ్రాముల షుగర్. రాత్రిపూట టీవీ చూస్తూ తింటే ఇన్సులిన్ స్పైక్ అయి కొవ్వు నిల్వ ఇంకా ఎక్కువ అవుతుంది.
4. కేకులు, పేస్ట్రీస్, మిఠాయిలు
ఒక చిన్న పీస్ బ్లాక్ ఫారెస్ట్ లేదా రెడ్ వెల్వెట్ కేక్‌లో 400–600 క్యాలరీస్, రిఫైండ్ షుగర్, క్రీమ్, బట్టర్. పండగలు, పుట్టినరోజుల్లో తప్ప మిగతా రోజులు పూర్తిగా మానేయడమే బెటర్.
5. ఫ్రైడ్ చికెన్ & ఇతర డీప్ ఫ్రైడ్ నాన్-వెజ్ స్నాక్స్
రెండు మీడియం పీసెస్ చికెన్ 65 లేదా కొత్తిమీర చికెన్‌లో 600–800 క్యాలరీస్. బయటి షాపుల్లో రీ-యూజ్డ్ ఆయిల్ వాడతారు కాబట్టి ట్రాన్స్ ఫ్యాట్ డబుల్ అవుతుంది.
6. ప్రాసెస్డ్ చీజ్ & చీజ్-లోడెడ్ ఫుడ్స్ (పిజ్జా, బర్గర్, పాస్తా)
30 గ్రాముల (2 స్లైసెస్) చీజ్‌లోనే 120 క్యాలరీస్ + 10 గ్రాముల సాచురేటెడ్ ఫ్యాట్. ఒక మీడియం పిజ్జాలో 4–5 స్లైసెస్ చీజ్ ఉంటే 500–600 క్యాలరీస్ ఒక్క చీజ్ నుంచే వస్తాయి.
7. నట్స్ (ఎక్కువ మొత్తంలో)
బాదం, జీడిపప్పు, పిస్తా చాలా హెల్తీ అయినా క్యాలరీ డెన్స్. ఒక చిన్న గోగు (20 గ్రాములు)లోనే 160–200 క్యాలరీస్. రోజుకి 15–20 గ్రాములు (10–12 బాదంపప్పు లేదా 5–6 జీడిపప్పు) మించితే కొవ్వు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
8. మయోనీస్, క్రీమ్ బేస్డ్ సాసెస్
ఒక టేబుల్ స్పూన్ మయోనీస్‌లో 90–100 క్యాలరీస్ – అందులో 90% ఫ్యాట్. సలాడ్‌లో, బర్గర్‌లో, శాండ్విచ్‌లో కొద్దిగా అనిపించినా 3–4 స్పూన్లు వాడితే 300–400 క్యాలరీస్ ఒక్క సాస్ నుంచే వచ్చేస్తాయి.
ఈ 8 ఆహారాలను ఒక వారం నుంచి పది రోజులు కట్ చేసి చూడండి.. మీ బరువు తగ్గే గ్రాఫ్ కచ్చితంగా మారిపోతుంది. వాటి స్థానంలో బేక్డ్ స్వీట్ పొటాటో, నిమ్మరసం నీళ్లు, గ్రీక్ యాగర్ట్, తాజా పండ్లతో చేసిన స్మూతీలు ఎంచుకోండి. చిన్న మార్పులే… పెద్ద ఫలితాలనిస్తాయి!
NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే జారీ చేయబడినవి.. వీటిని మేం దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి.




