AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Itching: తరచూ దురద ఇబ్బంది పెడుతుందా.. లైట్‌ తీసుకోవద్దు.. ఆ విటమిన్ లోపాలకు సంకేతం కావచ్చు..

కొన్ని సార్లు మనకు ఊరికే దురదపెడుతుంది. దాన్ని గోర్లతో గీరడం ద్వారా అది మరింత తీవ్రం అవుతుంది. అయితే ఇది సాధారణ సమస్య అనుకొని లైట్‌ తీసుకుంటే పెద్ద పొరపాటే. ఎందుకంటే ఇది దీర్ఘ కాలంలో తీవ్రమైన అనారోగ్యానికి లేదా శరీరంలో పోషకాహార లోపానికి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి ఏ విటమిన్ లోపం కారణంగా ఇలాంటి సమస్య వస్తుందో తెలుసుకుందాం పదండి.

Skin Itching: తరచూ దురద ఇబ్బంది పెడుతుందా.. లైట్‌ తీసుకోవద్దు.. ఆ విటమిన్ లోపాలకు సంకేతం కావచ్చు..
Vitamin Deficiency
Anand T
|

Updated on: Dec 04, 2025 | 7:57 PM

Share

చాలా మంది తరచూ దురదపెట్టడం అనే సమస్యను ఎదుర్కొంటారు. చాలా మంది ఇది సాధారణ సమస్య, అలర్జీల కారణంగా వస్తుందని అనుకుంటారు. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్యానికి దారి తీయవచ్చు, ఇది శరీరంలోని పోషకాహార లోపానికి సంకేతం కావచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో కొన్ని విటమిన్ల లోపం ఉన్నప్పుడు ఇలాంటి దురద పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏ విటమిన్ లోపం కారణంగా ఇలాంటి సమస్య వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

శరీరంలో దురద పెంచేందుకు కారణమయ్యే విటమిన్‌ లోపాలు ఇవే

విటమిన్ ఎ: ఎవరికైనా ఏ విటమిన్ లోపం ఉంటే వారికి తరచూ దరుద పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల శరీరం పొరిబారడం, దురద పెట్టడం జరుగుతుందని చెబుతున్నారు. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరం అవుతుందని.. ఎవరైనా ఇలాంటి సమస్య బారీన పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

విటమిన్ బి12: విటమిన్ బి12 లోపం వల్ల కూడా శరీరంలో దురద సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లోపం వల్ల చేతులు, కాళ్లలో ఎక్కువ దురద పెడుతుంది. ఇదే కాకుండా విటమిన్ బి3 లోపం వల్ల కూడా దురద పెడుతుంది. ఈ విటమిన్ లోపాన్ని నియాసిన్ అని కూడా అంటారు.

విటమిన్ ఈ, సి: మీకు తెలుసా? శరీరంలో విటమిన్ ఈ, విటమిన్ సి లోపం వల్ల కూడా దురద వంటి లక్షణాలు కనపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు మీ శరీరంలో కనిపిస్తే మీరు వెంటనే వైద్యులను సంప్రదించండి.

(గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 దృవీకరించలేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)