AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing Skin: చర్మంపై మచ్చలు, ముడతలు పోవాలా.. రాత్రి పూట ఇలా చేస్తే చాలు.. మెరిసే అందం మీ సొంతం..

Glowing Skin: చర్మంలో ముడతల సమస్య తగ్గాలంటే హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చర్మంలో ముడతల వల్ల ముఖంలోని మెరుపు పోతుంది. దీంతో చర్మం వదులుగా కూడా మారుతుంది. యవ్వనంగా, మెరిసే చర్మం కోసం అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉపయోగించండి. దీని వల్ల చర్మంలో తేమ అలాగే ఉండి చర్మం కూడా బిగుతుగా మారుతుంది. ముడుతలను నివారించడానికి, మీరు రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఈ క్యాప్సూల్‌తో చర్మాన్ని మసాజ్ చేయవచ్చు.

Glowing Skin: చర్మంపై మచ్చలు, ముడతలు పోవాలా.. రాత్రి పూట ఇలా చేస్తే చాలు.. మెరిసే అందం మీ సొంతం..
Aloevera Gel And Vitamin E
Venkata Chari
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 31, 2023 | 8:40 AM

Share

శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటు చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. మన శరీరానికి ఎంత పోషణ అవసరమో చర్మానికి కూడా అంతే అవసరం. చర్మాన్ని మచ్చలు లేకుండా ఉంచడానికి, ప్రజలు అనేక రకాల సౌందర్య చికిత్సలు, ఉత్పత్తులను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. కానీ, మెరిసే చర్మం కోసం మీరు ఇంటి నివారణలను కూడా ఉపయోగించవచ్చు.

చాలా సార్లు మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా ముఖంపై మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే బ్యూటీ ప్రొడక్ట్స్ బదులు విటమిన్ ఈ క్యాప్సూల్స్, అలోవెరా జెల్ వంటివి వాడొచ్చు. దాని గురించి తెలుసుకుందాం..

రాత్రి పూట ఇలా చేయాలి..

రాత్రి పడుకునే ముందు మీ చర్మాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. దీని తరువాత, ఒక చెంచా అలోవెరా జెల్‌లో ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేయండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా మీ ముఖంపై ఉంచి, ఉదయం నీటితో శుభ్రం చేసుకోండి. దీని వల్ల చర్మపు మచ్చలు, మొటిమల సమస్యలు పరిష్కారం అవుతాయి.

ఇవి కూడా చదవండి

చర్మాన్ని మృదువుగా చేయడంలో సహాయం..

రోజులో ఉండే దుమ్ము, ధూళి కారణంగా చర్మం డల్ గా మారి మృదువుగా ఉండలేకపోతుంది. కానీ, అలోవెరాలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, ఎంజైమ్‌లు చర్మానికి మెరుపునిస్తాయి. మీరు అలోవెరా జెల్, విటమిన్ ఈ కలిపి నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు.

ముడతలు తక్కువగా ఉంటాయి..

చర్మంలో ముడతల సమస్య తగ్గాలంటే హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చర్మంలో ముడతల వల్ల ముఖంలోని మెరుపు పోతుంది. దీంతో చర్మం వదులుగా కూడా మారుతుంది. యవ్వనంగా, మెరిసే చర్మం కోసం అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉపయోగించండి. దీని వల్ల చర్మంలో తేమ అలాగే ఉండి చర్మం కూడా బిగుతుగా మారుతుంది. ముడుతలను నివారించడానికి, మీరు రాత్రి నిద్రపోయే ముందు విటమిన్ ఈ క్యాప్సూల్‌తో చర్మాన్ని మసాజ్ చేయవచ్చు.

(ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ నమ్మకాలపై ఆధారపడి ఉంది. TV9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే అనుసరించాలి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!