- Telugu News Photo Gallery These complications in pregnant women are more likely to lead to miscarriage
Miscarriage: గర్భిణీ స్త్రీలు జాగ్రత్త.. ఈ సమస్యలు ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశం..
బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడిన తమ ప్రతీరూపాన్ని చూసుకోవడానికి సంతోషంగా భరిస్తారు. ఈ సమయంలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. గర్భధారణ సమయంలో థైరాయిడ్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో డయాబెటీస్ బారినపడతారు. అందుకే ఎప్పటికప్పుడు వైద్య పరీక్ష చేయించుకోవాలి అయితే కాబోయే తల్లులు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేదంటే గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 31, 2023 | 1:56 PM

బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో మహిళలు ఎంతో ఇబ్బంది పడిన తమ ప్రతీరూపాన్ని చూసుకోవడానికి సంతోషంగా భరిస్తారు. ఈ సమయంలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే కాబోయే తల్లులు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లేదంటే గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహం: చాలామంది మహిళలు గర్భధారణ సమయంలో డయాబెటీస్ బారినపడతారు. అందుకే ఎప్పటికప్పుడు వైద్య పరీక్ష చేయించుకోవాలి. డయాబెటిస్ కొన్నిసార్లు ప్రారంభ నెలల్లో గర్భస్రావానికి కారణం అవుతుంది. ఇది కాకుండా దీని కారణంగా పుట్టబోయే పిల్లలకు రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంది.

థైరాయిడ్: ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యతో మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతారు. అయితే గర్భధారణ సమయంలో థైరాయిడ్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది హార్మోన్ సంబంధిత సమస్య కాబ్బట్టి ఈ సమయంలో ఎల్లప్పుడూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం అవుతుంది.

క్రోమోజోముల్ అసాధారణత: ఫలదీకరణ సమయంలో స్పెర్మ్, అండం రెండూ 23 క్రోమోజోమ్‌లను సమీకరించి మ్యాచ్‌ని ఏర్పరుస్తాయి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందులో ఏదైనా లోపం జరిగితే క్రోమోజోమ్ అసాధారణతలకు కారణమవుతుంది ఇది గర్భస్రావానికి దారితీస్తుంది.

హార్మోన్ల అసమతుల్యత: ఒక ప్రెగ్నెంట్ మహిళకు ఇప్పటికే హార్మోన్ల సమస్య ఉన్న లేదా ఆమె శరీరం తగినంత ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను తయారు చేయలేని సమస్య ఏర్పడుతుంది. అప్పుడు గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కావున ఈ సమస్యను సకాలంలో గుర్తిస్తే పరిస్థితిని మందులతో నియంత్రించవచ్చు.

ఫైబ్రాయిడ్స్ : గర్భాశయ ఫైబ్రాయిడ్లు, గర్భాశయ లోపాలు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా కొన్నిసార్లు గర్భస్రావానికి కారణం కావచ్చు. అలాంటి ఏదైనా మీకు సమస్య ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భస్రావం వంటి సమస్యను నివారించడానికి వైద్య నిపుణుల సూచనలను తీసుకోవాలి.




