- Telugu News Photo Gallery Cinema photos Tollywood most wanted Top 3 heroines details here Telugu Entertainment Photos
Tollywood: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లు వీరే.. ఫుల్ ఫామ్ తో ట్రేండింగ్ లో హీరోయిన్స్.
గోల్డెన్ లెగ్ అంటూ అందరూ పొగుడుతున్నారు శ్రీలీలను. సీనియర్లు, యంగ్‌స్టర్స్ అనే తేడా లేకుండా అందరి పక్కనా ఫిట్ అయ్యే ఫీచర్స్ తో దూసుకుపోతున్నారు శ్రీలీల. ఆమె యాక్ట్ చేసిన సినిమాలన్నీ క్లిక్ అవుతుండటంతో, మేకర్స్ మనసు ఆ వైపే లాగుతోంది.అందుకే, స్కంధ, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, బాలయ్య భగవంత్ కేసరి, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, మహేష్ గుంటూరు కారం, విజయ్ దేవరకొండ సినిమా, పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ అంటూ చేతినిండా సినిమాలున్నాయి శ్రీలీలకు.
Updated on: Jul 31, 2023 | 1:45 PM

ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎప్పుడూ జట్లు జట్లుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది అలాంటి ఓ జట్టు. ఈ గ్రూప్‌లో ముచ్చటగా ముగ్గురున్నారు. సెట్స్ మీదున్న సినిమాల్లో చాలా వరకు వీరి పేర్లతోనే మారుమోగుతున్నాయి.

గోల్డెన్ లెగ్ అంటూ అందరూ పొగుడుతున్నారు శ్రీలీలను. సీనియర్లు, యంగ్‌స్టర్స్ అనే తేడా లేకుండా అందరి పక్కనా ఫిట్ అయ్యే ఫీచర్స్ తో దూసుకుపోతున్నారు శ్రీలీల. ఆమె యాక్ట్ చేసిన సినిమాలన్నీ క్లిక్ అవుతుండటంతో, మేకర్స్ మనసు ఆ వైపే లాగుతోంది.

అందుకే, స్కంధ, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, బాలయ్య భగవంత్ కేసరి, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, మహేష్ గుంటూరు కారం, విజయ్ దేవరకొండ సినిమా, పవన్ ఉస్తాద్ భగత్‌సింగ్ అంటూ చేతినిండా సినిమాలున్నాయి శ్రీలీలకు.

గుంటూరు కారంలో శ్రీలీల మాత్రమే కాదు, మీనాక్షి చౌదరి కూడా నాయికగా నటిస్తున్నారు. మహేష్ పక్కన ముందు ఈ సినిమాలో పూజా హెగ్డేని ఫిక్స్ చేశారు. అయితే ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేక విత్ డ్రా కావడంతో, ఆ ప్లేస్‌కి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి చౌదరి.

విశ్వక్‌సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమాలోనూ మీనాక్షి పేరు వినిపిస్తోంది. మట్కా, వెంకీ అట్లూరి డైరక్షన్‌లో దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమాలోనూ ఈ భామ పేరే ఖరారవుతుందంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. వరుసగా అవకాశాలతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ లేడీ.

అటు సీతారామమ్‌లో సీతామాలక్ష్మిగా నటించి మెప్పించారు మృణాల్ ఠాకూర్. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ కి ఫెస్టివల్ మోడ్ పరిచయం చేస్తున్నారు.

సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం కథాబలమున్న సబ్జెక్టులను సెలక్ట్ చేసుకుంటున్నారు. తెలుగులో నాని, విజయ్ దేవరకొండ సినిమాల్లో నటిస్తున్న మృణాల్‌కి హిందీలోనూ చేతినిండా ప్రాజెక్టులున్నాయి.





























