- Telugu News Photo Gallery Cinema photos Guppedantha Manasu Serial Fame Jyothi Rai Twitter account name is Jyothi Purvaj telugu cinema news
Guppendantha Manasu Jagathi: గుప్పెడంత మనసు జగతి రెండో పెళ్లి చేసుకుందా ?.. పేరు మార్చి హింట్ ఇచ్చేసింది..
జ్యోతిరాయ్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ గుప్పెడంత మనసు జగతి.. రిషి మదర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు వారికి దగ్గరయ్యింది జగతి.. ఇందులో కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే అమ్మగా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సాంప్రదాయ కట్టుబొట్టుతో ఎంతో పద్దతిగా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్‌కు తక్కువ కాదు.
Updated on: Jul 30, 2023 | 9:32 PM

జ్యోతిరాయ్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ గుప్పెడంత మనసు జగతి.. రిషి మదర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు వారికి దగ్గరయ్యింది జగతి.. ఇందులో కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే అమ్మగా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సాంప్రదాయ కట్టుబొట్టుతో ఎంతో పద్దతిగా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్‌కు తక్కువ కాదు.

కొద్ది రోజులుగా జగతి వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు కారణం యువ దర్శకుడు సుకు పుర్వాజ్ తో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోస్ షేర్ చేయడమే.

నిజానికి జగతికి 20 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి జరగ్గా..వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే జగతి భర్తను వదిలేసిందా అనే విషయాలు మాత్రం తెలియదు. ఆమె ఇన్ స్టా ఖాతాలోనూ భర్తకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేయలేదు.

మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో ప్రేమలో ఉందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు జగతి స్పందించలేదు.

తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ఒపెన్ చేసింది. ఆ ఖాతాకు తన పేరుతోపాటు డైరెక్టర్ పేరు జత చేసింది. జ్యోతి పుర్వాజ్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసింది..

నిజానికి పెళ్లయ్యాక మాత్రమే భర్త పేరును పెట్టుకుంటున్నారు. ఆ లెక్కన చూస్తే జ్యోతి సుకుపుర్వాజ్ పెళ్లిచేసుకున్నట్లే తెలుస్తోంది. అయితే దీనిపై సరైన స్పష్టత రావాల్సి ఉంది.





























