AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya: వీరికి బొప్పాయి అమృతంతో సమానం.. రోజుకొక కప్పు తిన్నారంటే అమేజింగ్ అంతే.!

బొప్పాయిలో అనేక ఔషధ గుణాలున్నాయి. లివర్, కిడ్నీ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఆల్కహాల్, పొగాకు వల్ల దెబ్బతిన్న కాలేయం, మూత్రపిండాలకు బొప్పాయి మంచిది. బొప్పాయిలో విటమిన్ A, B, C లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ బొప్పాయి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది.

Papaya: వీరికి బొప్పాయి అమృతంతో సమానం.. రోజుకొక కప్పు తిన్నారంటే అమేజింగ్ అంతే.!
Papaya Fruit
Ravi Kiran
|

Updated on: Mar 09, 2025 | 9:09 AM

Share

కొందరికి దారుణమైన దురలవాట్లుంటాయి. అయినా మానలేరు. విపరీతమైన డ్రింకింగ్ కొందరి బలహీనత. పొగబండిలా రోజంతా సిగరెట్లు తాగటం మరికొందరి అలవాటు. నాన చెత్త తినేసి, కిడ్నీని పాడుపాడు చేసుకోవడం మరికొందరి పని. వీళ్ళంతా రకరకాల మందులో ఎన్నెన్నో వాడతారు. అయినా వ్యాధులు తగ్గవు. దీనికి కారణం బలహీనమైన ఆహార సహాయం ఉండకపోవడం. ఈ బాధను తప్పించి బతుకునకు బలాన్ని ఇచ్చే బొప్పాయి అసలు రహస్యాలు బయటపడ్డాయి. తాజా పరిశోధనల్లో బొప్పాయి మహత్త్యం బయటపడింది. బొప్పాయి పండు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇవి ఎన్నో రోగాలను నయం చేసే గుణం వీటికి ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూసే బొప్పాయి కాయల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇది చదవండి: 109 బంతుల్లో ఒక్క పరుగు చేయలేదు.. ఈ డైనోసర్ బౌలర్ ముందు కోహ్లీ అట్టర్ ఫ్లాప్.. ఎవరో తెల్సా

రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు తినేవారికి కూడా చాలా అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి వల్ల రెండు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే లివర్ సమస్యల నుంచి బొప్పాయి రక్షిస్తుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం వల్ల లేదా స్మోకింగ్ అధికంగా చేయటం వల్ల లివర్ చెడిపోతుంది. అలాగే ఊపిరితిత్తులు కూడా చెడిపోతాయి. లివర్ పూర్తిగా చెడిపోకముందే క్రమం తప్పకుండా బొప్పాయి తీసుకోవాలి. ఇలా కనీసం 2 1/2 నుంచి 3 నెలల్లో ఒక కప్పు బొప్పాయి ముక్కలు తినడం వల్ల లివర్ సగం వరకు క్లీన్ అయినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే బొప్పాయి వల్ల మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే ఎక్కువగా కిడ్నీలలో రాళ్లు తొలగిపోతాయి. బొప్పాయిని తినటం వల్ల కిడ్నీలలో రాళ్లు కరిగిపోవడం లేదా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత

అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే బొప్పాయిలో విటమిన్ A, B, C ఈ విటమిన్లు మన శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుబాటులో ఉండే ప్రత్యేక ప్రభావితమైన ఫలం అంటే ఇదే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఈ బొప్పాయి తినడం మంచిది. బొప్పాయిలో ఔషధ గుణాలు మరియు విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎక్కువగా రక్త కణాలు పడిపోయిన వారికి తినిపించేందుకు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో బొప్పాయి చెట్టు ఆకుల రసం తాగిస్తారు. అలాగే చర్మ సౌందర్యానికి కూడా దీన్ని వాడతారు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ బొప్పాయిని తినడం అలవాటు చేసుకోవడం మంచిది.

ఇది చదవండి: ఈ ఫోటోలో మీకు మొదటిగా కనిపించేది.. మీరెలాంటివారో చెప్పేస్తుంది.. ఎలాగంటే.?

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి