- Telugu News Photo Gallery Cricket photos Does Sachin Tendulkar, Yuvraj Singh, and MS Dhoni gets pension from BCCI, Know the details
Team India: సచిన్, ధోని, యువరాజ్.. ఈ దిగ్గజ భారత క్రికెటర్ల పెన్షన్ ఎంతో తెలిస్తే బిత్తరపోతారు
సాధారణంగా క్రికెటర్లకు కోట్లలో మ్యాచ్ ఫీజులు ఉంటాయి. మరి వారికి పెన్షన్లు అందుతాయా.? అంటే.. దీనికి సమాధానం అవుననే చెప్పాలి. మరి దిగ్గజ భారత క్రికెటర్లకు ఎంత పెన్షన్ అందుతుంది.? బీసీసీఐ పెన్షన్ల విషయంలో వేటిని ప్రామాణికంగా తీసుకుంటుంది అనే విషయాలు ఇలా..
Updated on: Mar 08, 2025 | 5:14 PM

ప్రతీ మ్యాచ్‌కు క్రికెటర్లు లక్షల్లో ఫీజులు తీసుకుంటారు. అటు ఐపీఎల్ కాంట్రాక్ట్, బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ దక్కితే.. ఇక కోట్లలో సంపాదన. మరి ఇలాంటప్పుడు క్రికెటర్లకు పెన్షన్ వస్తుందా.? ఇది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఇప్పటితరం క్రికెటర్లకు మాత్రమే కాదు.. దిగ్గజ, మాజీ క్రికెటర్లకు సైతం పెన్షన్ ఇస్తుంది బీసీసీఐ. ఈ లిస్టులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా..

సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్.. లాంటి దిగ్గజ క్రికెటర్లు పెన్షన్ అందుకుంటున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 2013, సెప్టెంబర్ 13న క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అతడికి ప్రతీ నెలా బీసీసీఐ రూ. 70 వేల పెన్షన్ ఇస్తుంది.

ఇక భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా బీసీసీఐ నుంచి నెలకు రూ.70 వేల పెన్షన్ అందుకుంటున్నాడు. యువరాజ్ సింగ్‌కు ప్రతీ నెలా రూ. 60 వేల పెన్షన్ వస్తుంది. అటు సునీల్ గవాస్కర్‌కి కూడా భారత క్రికెట్ బోర్డు నెలకు రూ.70,000 పెన్షన్ అందిస్తోంది.

భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌కు బీసీసీఐ ప్రతి నెలా రూ.60,000 పెన్షన్ అందిస్తోంది. ఇక మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీకి బీసీసీఐ నెలకు రూ. 30 వేలు అందిస్తోంది.

బీసీసీఐ క్రికెటర్ల పెన్షన్‌ను.. వారు ఆడిన మ్యాచ్‌ల సంఖ్య, భారత్‌కి అందించిన ప్రదర్శన ఆధారంగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు కనీసం 25-49 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వారికి రూ. 60 వేలు, 75 అంతకంటే ఎక్కువ టెస్ట్‌లు.. లేదా 50 కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడి, భారత క్రికెట్‌కు అద్భుత విజయాలు అందించడంలో సహపడిన క్రికెటర్లకు రూ. 70 వేలు లభిస్తాయి.




