AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: భర్తతో ఫస్ట్‌నైట్.. బాయ్‌ఫ్రెండ్ కోసం భార్య మారాం.. ఈ మూవీ చూడాలంటే రెండు కళ్లు చాలవు

యాక్షన్, సస్పెన్స్ మూవీలు చూసి బోర్ కొట్టినవారికి ఓ మాంచి ఫ్యామిలీ చిత్రాన్ని తీసుకొచ్చేశాం. మలయాళంలో అదరగొట్టిన ఈ చిత్రం.. రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి అదేంటి.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

OTT Movie: భర్తతో ఫస్ట్‌నైట్.. బాయ్‌ఫ్రెండ్ కోసం భార్య మారాం.. ఈ మూవీ చూడాలంటే రెండు కళ్లు చాలవు
Ott Movie
Ravi Kiran
|

Updated on: Mar 08, 2025 | 3:03 PM

Share

క్రైమ్, యాక్షన్, సస్పెన్స్, రొమాంటిక్.. ఇలా జోనర్ ఏదైనా, భాష ఏవైనా.. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక.. అన్ని ఇండస్ట్రీల సినిమాలు మనం ఒక్క క్లిక్‌తో చూసేయొచ్చు. ఫ్యామిలీ డ్రామాలు మెచ్చే ఆడియన్స్‌కు ఓ మాంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ మూవీలో ఫస్ట్ నైట్ ధైర్యంగా చేసుకోవడానికి హీరోకి మందు తాగమని సలహా ఇస్తారు అతడి ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ.? మరి ఈ మూవీ ఏంటి.? ఏయే ఓటీటీలలో చూడొచ్చునంటే.?

ఇది చదవండి: అయ్యారే.! చిన్నది అనుకునేరు.. స్విచ్ ఆన్ చేస్తే మంచు వర్షం కురవాల్సిందే

మనం చెప్పుకోబోయే సినిమా టైటిల్ ‘మందాకిని’. ఈ మలయాళం ఫ్యామిలీ డ్రామాను వినోద్ లీలా దర్శకత్వం వహించారు. 2024లో విడుదలైన ఈ చిత్రంలో అల్తాఫ్ సలీం, అనార్కలి మరికర్, గణపతి ఎస్. పొదువాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. మన హీరో పేరు అరుమల్.. ఓ మాదిరి అందంగా ఉంటాడు. ఇతడ్ని మొదటిగా ఓ ముగ్గురు అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారు. అయితే ఆ తర్వాత దేవుడు.. ఇతడికి ఓ అందమైన అమ్మాయితో పెళ్లి జరిగేలా చేస్తాడు. ఇక పెళ్లికూతురు మందాకిని చాలా అందంగా ఉంటుంది. వీరిద్దరికీ పెళ్ళైన రోజే ఫస్ట్ నైట్. ఇక అరుమల్‌ ధైర్యంగా ఫస్ట్ నైట్ చేసుకోవడానికి.. మందు తాగమని సలహా ఇస్తారు ఫ్రెండ్స్. అనూహ్యంగా అరుమల్ సెట్ చేసుకున్న పెగ్ గ్లాస్ కాస్తా మారిపోతుంది. ఆ నైట్ హీరో జ్యూస్ తాగితే.. హీరోయిన్ మందు తాగుతుంది. తాగిన మత్తులో రచ్చ చేస్తుంది మందాకిని.. తనను తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్లమని మారాం చేస్తుంది. ఈ విషయం అరుమల్ తల్లిదండ్రులకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నోరూరించే పచ్చి చేపల కూర.. కడుపులో మంటతో ఆస్పత్రికి పరుగులు.. ఎక్స్‌రే తీయగా

మరుసటి రోజు ఈ వ్యవహారం ఏంటని అరుమల్ తల్లి.. మందాకిని తల్లిదండ్రులను అడుగుతుంది. తమ తప్పు ఏం లేదని.. మా అమ్మాయికి మందు ఎలా తాగిపిస్తారంటూ గొడవకు దిగుతారు మందాకిని పేరెంట్స్. వాస్తవానికి మందాకిని అరుమల్‌ను పెళ్లి చేసుకోకముందే.. సుజిత్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. అతడితో లేచిపోవాలని చూస్తుంది. కానీ చివరి నిమిషంలో ఆమెను మోసం చేసి.. నగలతో పారిపోతాడు సుజిత్. ఇక మోసపోయానని గ్రహించిన మందాకిని.. ఆ తర్వాత అరుమల్‌ను పెళ్లాడుతుంది. కోడలి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న అత్త.. మందు కొట్టి.. సుజిత్ దగ్గరకు వెళ్లి విషయం తేల్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. మందాకిని సుజిత్ దగ్గరకు అసలు ఎందుకు వెళ్లాలని అనుకున్నది.? అరుమల్, మందాకిని ఫస్ట్ నైట్ జరిగిందా.? వీరిద్దరి జీవితాలు చివరికి సుఖంతమాయ్యయా.? అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే.

ఇది చదవండి: ఈ ఫోటోలో దాగున్న పిల్లులను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరు తోపులే మావ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి