Andhra News: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. వల బరువెక్కడంతో పైకి లాగి చూడగా
సముద్రమే మత్స్యకారులకు జీవన ఆధారం. రోజూ క్రమం తప్పకుండా చేపల వేటకు వెళ్లాలి.. తిరిగి వచ్చేటప్పుడు బోలెడన్ని చేపలు ఒడ్డుకు తేవాలి. అప్పుడే వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో.. తమ బ్రతుకు జట్కా బండిని సాగిస్తుంటారు జాలర్లు. అలాంటి జాలర్లకు తాజాగా ఓ భారీ చేప..

మత్స్యకారులకు సముద్రమే జీవనాధారం. ఒక్కసారి సముద్రంలోకి వేటకు వెళ్ళారంటే.. అది వారం అయినా.. లేక నెల అయినా.. కచ్చితంగా చేపలతోనే తిరిగి ఒడ్డుకు చేరుకోవాలి. ఎందుకంటే.! సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు వాళ్ల వలకు చిక్కిన చేపలను అమ్మిన డబ్బుతోనే ఈ జాలర్ల రోజు గడుస్తుంది. సముద్రానికి, వారి జీవితానికి.. అందుకే అవినాభావ సంబంధం ఎప్పుడూ ఉంటుంది. ఇక వేటకు వెళ్లిన జాలర్లకు ఒక్క చేపలు మాత్రమే కాదు.. వివిధ రకాలైన వింత సముద్రపు జీవులు కూడా అప్పుడప్పుడూ చిక్కుతుంటాయి. ఈ కోవలోనే తాజాగా వేటకు వెళ్లిన కొందరు మత్స్యకారులకు ఓ భారీ చేప వలకు చిక్కింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతీరోజూ మాదిరిగానే ఆ రోజు కూడా అంతర్వేది సముద్రతీరంలో మచిలీపట్నం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. తమ వలను సముద్రంలోకి వేసి.. కాసేపు ఊపిక పట్టారు. ఈలోగా ఆ వల బరువెక్కగా.. దాన్ని పైకి లాగి చూశారు. అంతే.! వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాదాపుగా 300 కేజీల భారీ కొమ్ము కోనం చేప పడింది. దీంతో వారి పంట పండింది. హైలెస్సా.. హైలెస్సా అంటూ కొమ్ము కోనం చేపను ఒడ్డుకు తెచ్చారు . ఇక అంతర్వేది ఫిషింగ్ మినీ హార్బర్‌లో ఆ చేప కేజీ రూ. 600 చొప్పున కొనుగోలు చేశారు దళారులు. కాగా, అంతర్వేది సముద్రతీరంలోనికి వేటకు వెళ్లే కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జాలర్లకు అధిక సంఖ్యలో భారీ కొమ్ము కోనం చేపలు లభ్యమవుతుండటం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




