Thalapathy Vijay: తమిళనాట ఏపీ కూటమి తరహాలో.. డిప్యూటీ సీఎంగా విజయ్.!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే సమయం ఉంది. అయితే అప్పుడే ఎక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారుతున్నాయి. గడిచిన దశాబ్దాలుగా ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు ఒక లెక్క ఈ ఎన్నికలు ఓ లెక్క అన్నట్టుగా ఉన్నాయి తాజా పరిణామాలు. అందులోనూ తమిళనాట అంతా ఏపీ ఫార్ములా గురించే చర్చ జరుగుతోంది.. ఇక్కడ కూటమి సక్సెస్ ఉదాహరణగా విజయ్ కూడా అదే ఫాలో కాబోతున్నారన్న డిస్కషన్ జరుగుతోంది.

తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనుండగా.. సరిగ్గా ఏడాది కూడా సమయం లేదనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ తమిళనాడులో జరిగే డిస్కషన్ ఇప్పటిదాకా ఒక్కటే.. ఈసారి అధికారంలోకి అన్నాడీఎంకే వస్తుందా లేదా డీఎంకే అధికారంలోకి వస్తుందా..? కానీ ఇప్పుడు నటుడు విజయ్ పార్టీ పెట్టిన తర్వాత చర్చ వేరేలా ఉంది. విజయ్ కూడా కూటమి ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళతామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
నటుడు విజయ్ ఇటీవల తొలి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో మహానాడును నిర్వహించారు. సమావేశానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ టీంలో ఈ రకంగా పని చేసిన అర్జున్ ప్రస్తుతం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలోనే ఉన్నారు. అయితే సమావేశం అనంతరం విజయ్.. ప్రశాంత్ కిషోర్ భేటీలో జరగనున్న ఎన్నికల్లో పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ అధికారంలో ఉన్న డీఎంకేను పదేపదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు.
అప్పుడప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలను, బీజేపీ తీరును టార్గెట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకేను ఎప్పుడు.? ఎక్కడా.? విమర్శించిన పరిస్థితులు లేదు. సొంతంగా కూటమి ఏర్పాటు చేసి అధికారాన్ని రక్షించుకోవాలని విజయ్ ఆలోచనగా ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్, విజయ్ భేటీలో వీటన్నింటిపై చర్చ జరగగా ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే లేదా అన్నాడీఎంకే.. ఈ రెండు ప్రధాన పార్టీలు కూడా మిగిలిన పార్టీలతో కలిసి కూటమిగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ రెండు ప్రధాన పార్టీలకు శాశ్వత ఓటు బ్యాంకు అంటూ ఒకటి ఉంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకేకు పర్మనెంట్ ఓటు బ్యాంకుగా 25 శాతం ఉండగా.. తాజాగా ఏర్పాటైన టీవీకే పార్టీకి 20 శాతం ఓట్లు రావచ్చని అంచనాగా ప్రశాంత్ కిషోర్ విజయ్‌కి చెప్పినట్టు సమాచారం.
ఓటమిలో ఉన్న మిగిలిన పార్టీల ఓటు బ్యాంకు కలిస్తే మొత్తం 50 శాతానికి తగ్గకుండా అధికారంలోకి రావడానికి సులువుగా ఉంటుందని విజయ్‌కు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలుస్తోంది. గతంలో డీఎంకే అధికారంలో రావడానికి ప్రశాంత్ కిషోర్ పనిచేయగా.. అందులో కీలకంగా ఉన్నటువంటి అర్జున్ ప్రస్తుతం టివీకే పార్టీలో ఉన్నారు. ఈసారి విజయ్ తరఫున ఎన్నికల నిర్వహణ మొత్తం అర్జున్ చూసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. కూటమిగా ముందుకు వెళ్దామని విజయ్ ఆలోచిస్తున్నారట. అధికారంలోకి వస్తే సీఎంగా పళనిస్వామి.. డిప్యూటీ సీఎంగా విజయ్ తమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచడానికి కూడా సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఆ తర్వాతి ఎన్నికల్లో విజయ్ సొంతంగా బరిలోకి దిగితే విజయావకాశాలు మెరుగుపడతాయని సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లోని 2024 ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా ప్రశాంత్ కిషోర్ విజయ్‌కు క్షుణ్ణంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బలమైన పార్టీగా ఉన్న వైసీపీని ఢీకొట్టడానికి మూడు పార్టీలు కూటమిగా ఉండడం వల్లే క్లీన్ స్వీప్ చేయగలిగిందని.. పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో వీడియో సాధించగలిగారని విజయ్‌కు చెప్పారట. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడినట్టు.. ఇక్కడ అన్నాడీఎంకే, విజయ్ స్థాపించిన టీవీకే.. అలాగే అగ్రవర్ణాలకు సంబంధించిన ఓటు బ్యాంకు అధికంగా కలిగిన పీఎంకె.. ఈ మూడు పార్టీల కలయిక ఏపీ తరహాలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విజయ్, ప్రశాంత్ కిషోర్ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి