AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు.. శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం CRDA టెండర్లు..

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) చర్యలు చేపట్టింది.

అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు.. శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం CRDA టెండర్లు..
Amaravati Ap Capital
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 02, 2025 | 7:58 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) చర్యలు చేపట్టింది.

టెండర్ల ప్రక్రియ – కీలక సమయాలు

CRDA అసెంబ్లీ భవనం నిర్మాణానికి 768 కోట్ల రూపాయలు, హైకోర్టు భవనం నిర్మాణానికి 1,048 కోట్ల రూపాయలు అంచనా వేసి బిడ్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలు గడువును ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పెట్టింది. అలాగే సాంకేతిక బిడ్ సమర్పణకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు గడువు పెట్టింది. ఇక ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలనకు సాంకేతిక అర్హతలు పరిశీలించిన అనంతరం ఏజెన్సీల ఎంపిక ఉంటుందని చెప్పింది.

అసెంబ్లీ భవన నిర్మాణం – ప్రణాళికలు

విస్తీర్ణం: 103.76 ఎకరాల్లో 11.21 లక్షల స్క్వేర్‌ ఫీట్‌.

ఇవి కూడా చదవండి

నిర్మాణ విధానం: బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 3 అంతస్తులు.

డిజైన్: లండన్‌కు చెందిన ప్రముఖ సంస్థ నార్మన్ పోస్టర్స్.

ఆకృతి: పైభాగం శిఖరాకారంలో ఉండేలా, నగరాన్ని చూడగలిగేలా ప్రత్యేక ప్రణాళిక.

నిర్మాణ వ్యయం:

2018లో అంచనా: 555 కోట్లు

ప్రస్తుత అంచనా: 768 కోట్లు

విభిన్న ఆకృతిలో అసెంబ్లీ భవనం..

మొదటి అంతస్తు:

మంత్రుల ఛాంబర్లు

అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాల్

క్యాంటీన్లు, లైబ్రరీ, సెంట్రల్ హాల్

రెండో అంతస్తు:

అసెంబ్లీ, కౌన్సిల్ హాళ్లు

కమిటీ ఛాంబర్లు, సభ్యుల లాంజ్

శిక్షణ కేంద్రం

శాశ్వత హైకోర్టు భవనం – నిర్మాణ ప్రణాళికలు

విస్తీర్ణం: 42.36 ఎకరాల్లో 20.32 లక్షల స్క్వేర్‌ ఫీట్‌.

నిర్మాణ శైలి: బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 7 అంతస్తులు.

డిజైన్ మార్పులు:

గత అంచనా వ్యయం: 860 కోట్లు

ప్రస్తుత అంచనా వ్యయం: 1,048 కోట్లు

ఎత్తైన భవనం – ముఖ్యమైన విభాగాలు

ఏడో అంతస్తు:

పూర్తి స్థాయి కోర్టు సమావేశ మందిరం

డైనింగ్ హాల్

సువిశాల గ్రంథాలయం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..