Viral: నోరూరించే పచ్చి చేపల కూర.. కడుపులో మంటతో ఆస్పత్రికి పరుగులు.. ఎక్స్‌రే తీయగా
ఆ ఇద్దరూ చాలా ప్రసిద్ది చెందిన థాయి డిష్ తిన్నారు. ఏం జరిగిందో ఏమో.. కడుపు నొప్పి బారినపడి.. ఆస్పత్రి పాలయ్యారు. ఇక అక్కడి వైద్యులు వారికీ ఎక్స్ రే తీసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఆ వివరాలు ఇలా

థాయి ప్రావిన్స్‌కు చెందిన ఖోన్ కేన్, ఇసాన్ వంటకాలు.. స్థానికంగా ఎంత ప్రసిద్ది చెందినవో.. అవి ఒక వ్యక్తి తింటే.. అతడ్ని ప్రాణాంతకమైన కాలేయ క్యాన్సర్ బారిన పడేసే డేంజర్ వంటకాలు కూడా. ‘కోయి ప్లా’ అనే థాయి డిష్.. పలు మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మరసంతో కలిసిన పచ్చి చేపలు నిండిన ప్లేట్. కానీ ఈ పచ్చి చేపలు అధిక మోతాదులో పరాన్నజీవులతో నిండి ఉంటాయి. ఇవి తిన్నవారికి కాలేయ క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి.
బీబీసీ కథనం ప్రకారం.. ‘కోయి ప్లా’ ప్రసిద్ధి చెందిన థాయిలాండ్ ప్రాంతాలలో దొరికే డిష్.. ఇందులో అధిక స్థాయిలో కాలేయ క్యాన్సర్‌కు కారణమయ్యే పరాన్నజీవులు ఉంటాయి. ఈ వ్యాధిపై పలు అధ్యయనాలు జరపగా.. 80 శాతం క్యాన్సర్‌కు దారి తీసే పరాన్నజీవులు ఉన్నాయని తేలింది, అయితే క్యాన్సర్ సాధారణంగా హోస్ట్ 50 ఏళ్లు ఉన్నవారికే వ్యాప్తి చెందుతుంది. కానీ కోయి ప్లా డిష్ తిన్నవారి ఎక్స్‌రే చూస్తే.. వారి శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఈ పరాన్నజీవులు ఎలా క్యాన్సర్‌ను వ్యాప్తి చేస్తాయని అనేది చూడవచ్చు.
ఈ పరాన్నజీవులపై జరిగిన పరిశోధనలో అవి వాటి హోస్ట్‌లో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను ప్రేరేపించే రసాయనాలను తయారు చేయగలవని, ఇది మంటను కలిగిస్తుందని.. తరువాత అది దీర్ఘకాలికంగా మారి క్యాన్సర్‌గా అభివృద్ధి చెందుతుందని కనుగొన్నారు. థాయిలాండ్‌కు చెందిన డాక్టర్ నరోంగ్ ఖుంటికియో తన తల్లిదండ్రులు ఇద్దరూ ఈ ప్రమాదకరమైన రుచికరమైన పదార్థాన్ని తిన్న తర్వాత కాలేయ క్యాన్సర్‌తో మరణించారన్నారు. ఈ వ్యాధి బారినపడ్డవారికి శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేయకపోతే.. ‘సైలెంట్ కిల్లర్’లా వ్యాధి వ్యాపించి కాలేయ క్యాన్సర్‌కు దారి తీస్తుందన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి