AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత

దమ్మున్న ఆటగాడిని ఆటకు దూరం చేయలేం. కచ్చితంగా కంబ్యాక్ స్ట్రాంగ్ ఉంటుంది. సేమ్ సీన్ ఈ టీమిండియా క్రికెటర్ కు కూడా జరిగింది. ఆటకు పనికిరాడని పక్కన పెట్టేసింది.. కట్ చేస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీలో తన బ్యాట్ తో చెలరేగిపోయాడు. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 4 మ్యాచ్ లలో.. 195 పరుగులు చేసి.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

దమ్మునోడురా మావా.! బీసీసీఐ ఛీ కొట్టి తరిమేసింది.. కట్ చేస్తే.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత
Team India
Ravi Kiran
|

Updated on: Mar 07, 2025 | 6:54 PM

Share

శ్రేయాస్ అయ్యర్.. ఒక్కప్పుడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పక్కనపెట్టడమే కాదు.. జట్టులో ఛాన్స్‌లు ఇవ్వకుండా తన్ని తరిమేసింది. స్థాయికి తగ్గట్టు ప్రదర్శన కనబరిచినా చిన్న చూపు చూసిన బీసీసీఐకి కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. అరిచిన నోళ్లను తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. వన్డేల్లో నెంబర్ 4గా తన స్టామినా ఏంటో ఛాంపియన్స్ ట్రోఫీలో నిరూపించుకోవడమే కాదు.. బీసీసీఐతో మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్ అందుకోబోతున్నాడు.

అయ్యర్ రీ-ఎంట్రీ..

సెంట్రల్ వార్షిక కాంట్రాక్ట్‌లలో నుంచి బీసీసీఐ శ్రేయాస్ అయ్యర్ పేరును అర్ధాంతరంగా తీసేసింది. అతనిపై క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకుంది. దేశవాళీ క్రికెట్ ఆడకుండా బీసీసీఐ నియమాలను ఉల్లంఘించాడంటూ.. ఆ సమయంలో బీసీసీఐ ఆరోపణలు చేసింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ కథ అయిపోయిందని అందరూ ఊహించారు. కానీ కంబ్యాక్ అంతకంటే స్ట్రాంగ్‌గా ఇచ్చాడు శ్రేయాస్.

ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా బీసీసీఐ నిర్ణయాలు..

జాతీయ మీడియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త కాంట్రాక్టులలో ఆటగాళ్ల గ్రేడ్‌.. మూడు ఫార్మాట్లలో వారి ప్రదర్శన ఆధారంగా ఉండబోతోందట. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు చెందిన గ్రేడ్ ఏ ప్లస్‌ను కూడా బీసీసీఐ పున: పరిశీలించనుంది బీసీసీఐ.

ఇవి కూడా చదవండి

టాప్ గ్రేడ్ నుంచి రోహిత్, విరాట్ అవుట్..?

కొత్త వార్షిక కాంట్రాక్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా స్థానాలు మారే అవకాశం కనిపిస్తోంది. గ్రేడ్-ఏ ప్లస్ కేవలం మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లకు ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. టెస్ట్ సీజన్‌లో వీరి ప్రదర్శన అంత బాగా లేదు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ దక్కితే, ఈ ముగ్గురు సేఫ్ అని టాక్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!