AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పప్పు నానబెట్టిన నీటితో చర్మ సమస్యలకు చెక్.. ఆరోగ్యానికి బోలేడు ప్రయోజనాలు..

పప్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. నానబెట్టిన పప్పులు లేదా పచ్చి పప్పులు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.

పప్పు నానబెట్టిన నీటితో చర్మ సమస్యలకు చెక్.. ఆరోగ్యానికి బోలేడు ప్రయోజనాలు..
Gram Water
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2021 | 11:53 AM

Share

పప్పులు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. నానబెట్టిన పప్పులు లేదా పచ్చి పప్పులు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రిళ్లు నానబెట్టిన ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. ముఖ్యంగా శనగ పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినడం వలన శరీరానికి ప్రయోజనాలు అధికంగానే ఉన్నాయి. అయితే కేవలం పప్పు మాత్రమే కాదు.. నానబెట్టిన నీరు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒకవేళ నేరుగా పప్పు నానబెట్టిన నీరు తాగాలనిపించకపోతే.. వాటిని ఉడకబెట్టి.. అందులో జీలకర్ర, నల్ల ఉప్పు, నిమ్మకాయను కలుపుకుని తీసుకోవచ్చు. నానబెట్టిన పప్పు నీటితో కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది… రోజూ ఉదయం ఖాళీ కడుపుతో శనగ పప్పు నానబెట్టిన నీటిని తాగితే రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే అన్ని రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

మధుమేహాన్ని నియంత్రిస్తుంది… నానబెట్టిన శనగ పప్పు నీరు మధుమేహాన్ని నియంత్రిండంలో సహయపడుతుంది. రోజు ఉదయాన్నే ఈ నీటిని తాగడం వలన రక్తంలో షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేస్తుంది.

బరువు తగ్గిస్తుంది.. బరువు తగ్గడానికి రోజూ ఉదయం నానబెట్టిన పప్పు నీరు తాగడం మంచిది. ఇది అలసటను తగ్గిస్తుంది. అలాగే బలహీనంగా ఉండనివ్వదు. అలాగే పొట్ట కూడా నిండినట్లు అనిపిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో శనగ పప్పు నీటిని తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మాన్ని క్లియర్‏గా చేస్తుంది.. నానబెట్టిన శనగ పప్పు నీరు చర్మాన్ని అంతర్గతంగా శుభ్రపరుస్తుంది. అలాగే చర్మ సమస్యలను నిరోధిస్తుంది. అలాగే సహజ సౌందర్యాన్ని పెంచుతుంది.

Also Read:

ఈ వారం మరింత జోష్‏గా ఎంజాయ్ చేయండిలా.. ఒకేరోజు థియేటర్లలో సినిమాల సందడి..

Varun Tej: ‘గని’ కష్టాలు మాములుగా లేవుగా.. జిమ్‏లో వరుణ్ తేజ్ వర్కవుట్స్..

Nagarjuna: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా కింగ్ నాగార్జున.. శరవేగంగా జరుగుతున్న షూటింగ్..