Dosakaya Water: రోజూ ఉదయాన్నే దోసకాయ వాటర్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ ఎలా అంటే

Dosakaya Water: కూరగాయల్లో ఒకటి దోసకాయ. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి సాగు చేస్తున్న ఒక కూరగాయల పంట దోసకాయ. ఈ దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం..

Dosakaya Water: రోజూ ఉదయాన్నే దోసకాయ వాటర్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో.. తయారీ ఎలా అంటే
Dosakaya Water
Follow us
Surya Kala

|

Updated on: Aug 03, 2021 | 11:50 AM

Dosakaya Water: కూరగాయల్లో ఒకటి దోసకాయ. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి సాగు చేస్తున్న ఒక కూరగాయల పంట దోసకాయ. ఈ దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, విటమిన్ కేలతో పాటు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు దోసకాయలో నీటి శాతం కూడా అధికం..అందుకని శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ దోసకాయ ని కూరలతో పాటు ఆవకాయ కూడా చేస్తారు. కానీ వీటికంటే దోసకాయ పానీయం ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తుంది. ఈరోజు దోసకాయ పానీయం తయారీ.. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనంల గురించి తెలుసుకుందాం..

దోసకాయ పానీయం తయారీ :

మంచి దేశవాళీ దోసకాయలను తీసుకుని ముక్కలుగా కోసి.. వాటిని రాత్రి పూట ఒక గాజు గ్లాస్ లో వేసి.. అందులో నీరు పోసి నానబెట్టాలి. మర్నాడు ఉదయం రిఫ్రెష్ పానీయం ఉదయం సిద్ధంగా ఉంటుంది. ఈ నీటిని ఉదయం తాగితే శరీరంలోని విష పదార్ధాలు విసర్జింప బడతాయి.

దోసకాయ పానీయం ప్రయోజనాలు:

*ఎముక దృఢంగా ఉండేలా చేస్తుంది *దోసకాయలో ఉండే విటమిన్ కే .. ఏదైనా గాయాలు అయిన సమయంలో గడ్డకట్టకుండా చేస్తుంది. *దోసకాయ నీరు తాగితే జీవక్రియ పనితీరుని మెరుగు పరుస్తుంది. *శరీరం హైడ్రేటెడ్ ఉండేలా చూస్తుంది. *నీటిలో దోసకాయ కలిసినప్పుడు ఆ నీటిలో విటమిన్లు, ఖనిజాలు చేరతాయి. ఆ నీరు ఆరోగ్యాన్ని ఇస్తుంది. * బిపి స్థాయిని తగ్గిస్తుంది *మూత్రపిండాల సమస్యలను దోసకాయ నీటితో దూరంగా ఉంచవచ్చు. *దోసకాయలో ఎక్కువ మొత్తంలో సిలికా కంటెంట్ ఉంది. దీంతో దోసకాయ నీరు అంతర్గతంగా మెరుస్తున్న చర్మాన్ని అందిస్తుంది. * దోసకాయ నీరు బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. * దోసకాయలో కుకుర్బిటాసిన్ అధికంగా ఉంది. అలాగే, ది అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం, ఈ ద్రవాన్ని తగినంతగా తీసుకోవడం వల్ల మూత్ర క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఎందుకంటే కుకుర్బిటాసిన్‌లను క్యాన్సర్ నివారణగా గుర్తించారు. ఇది క్యాన్సర్ కణాలను చంపి వాటి పెరుగుదలను నివారిస్తుంది. ఈ విషయాన్నీ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో 2013 సంవత్సరంలో ప్రచురించింది. *దోసకాయ నీరు తగినంతగా తీసుకోవడం వల్ల వయస్సు పెరిగినా చర్మం బలంగా ఉంటుంది. *దోసకాయ నీటిలో ఫిసెటిన్ పుష్కలంగా ఉంది. ఇది మెమరీ శక్తిని పెంచే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

Also Read: బిల్వపత్రం ఎన్ని రకాలు.. ఏ ఏ బిల్వపత్రాలతో పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయంటే

Paralysis Symptoms: వయసుతో పనిలేకుండా వస్తున్న పక్షవాతం.. లక్షణాలు.. ఆయుర్వేదంలో నివారణ చికిత్స