Parenting Tips: మీ పిల్లలు తరచూ ఫుడ్‌పాయిజనింగ్ బారిన పడుతున్నారా? ఈ ఆరోగ్య చిట్కాలు మీకోసమే..
Food Poison: ఫుడ్ పాయిజనింగ్ అనేది పిల్లలలో ఎక్కువగా వచ్చే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు, కానీ పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఎందుకంటే వారి రోగనిరోధక వ్యవస్థ..
Food Poison: ఫుడ్ పాయిజనింగ్ అనేది పిల్లలలో ఎక్కువగా వచ్చే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇది ఏ వయసులోనైనా సంభవించవచ్చు, కానీ పిల్లలు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఎందుకంటే వారి రోగనిరోధక వ్యవస్థ సూక్ష్మక్రియులతో పోరాడేటంత బలంగా ఉండదు. అందుకే కొందరు పిల్లలు ఏది తిన్నా అనారోగ్యం బారిన పడుతుంటారు. సాధారణంగా, బ్యాక్టీరియా లేదా వైరస్‌లు ఆహారం, నీటిని విషపూరితం చేస్తాయి. వీటిని తీసుకుంటేనే పిల్లలకు ఫుడ్ పాయిజన్ సమస్యలు తలెత్తుతాయి. మరియు పిల్లలు ఆ ఆహారాన్ని తింటే, వారికి ఫుడ్ పాయిజన్ వస్తుంది. పిల్లలలో ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులు, తలనొప్పి. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. అదే సమదర్భంలో పిల్లల ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఈ డ్రింక్స్ ఇవ్వొద్దు..
పిల్లల్లో ఉదర సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కొందరు తల్లిదండ్రులు చల్లటి పానీయాలు ఇస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఇవి పిల్లల శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. ఫలితంగా మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక ఫుడ్ పాయిజనింగ్ వల్ల చాలామంది పిల్లల్లో వాంతులు, విరేచనాలు కలుగుతాయి. దీనివల్ల శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితుల్లో కూల్‌డ్రింక్స్ తాగించడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయి.
టీ, కాఫీలకు దూరంగా..
శీతల పానీయాల మాదిరిగానే పిల్లలకు టీ, కాఫీలు ఇవ్వడం పూర్తిగా మానేయాలి. పిల్లలు కాఫీ తాగిన తర్వాత కాసేపు యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇందులో ఉండే కెఫిన్ శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కూడా పిల్లలకు మంచిది కాదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ఆరోగ్యానికి మంచిదని భావించినప్పటికీ, పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ సమస్య ఉంటే, వారికి అధిక ఫైబర్ ఫుడ్ ఇవ్వకూడదు. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని పిల్లలకు సూచించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, ఎనర్జీ డ్రింక్స్‌ను పిల్లలకు అందించాలి.
చిప్స్, చాక్లెట్లను కూడా..
ఫుడ్ పాయిజనింగ్ ఉన్న పిల్లలకు చిప్స్, చాక్లెట్ వంటివి ఇవ్వకండి. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో గ్లూటెన్ కూడా ఎక్కువగా ఉంటాయి. బ్రెడ్, బిస్కెట్లను కూడా దూరంగా ఉంచాలి. వీటికి బదులు తేలికగా జీర్ణమయ్యే కిచిడీ లాంటి పదార్థాలను వండిపెట్టండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..