Health Tips: బద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? ఇలా చెక్ పెట్టండి..!

Health Tips: సోమరితనంతో బాధపడుతున్నారా? బద్ధకం కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నారా? ఎప్పుడూ అలసిపోవడం, నిద్రపోవడం

Health Tips: బద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? ఇలా చెక్ పెట్టండి..!
Lazyness
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 02, 2022 | 10:39 PM

Health Tips: సోమరితనంతో బాధపడుతున్నారా? బద్ధకం కారణంగా దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నారా? ఎప్పుడూ అలసిపోవడం, నిద్రపోవడం చేస్తు్న్నారా? ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తు్న్నారు. సోమరితనం కారణంగా జీవితంలో ప్రతీ పనిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అయితే, బద్దకం అనేది మనస్తత్వానికి సంబంధించినది.

విసుగు: రోజూ చేసే పనులు కారణంగా చాలా మంది విసుగుచెందుతుంటారు. రోజూ అదే పని చేయడం, అదే ఒత్తిడి, అదే ఆహారం ఉండటంతో విసుగు చెందుతారు. అదికాస్తా బద్ధకం, సోమరితనానికి దారి తీస్తుంది. అయితే బద్ధకం అనేది వ్యక్తి జీవితాన్ని స్తంభింపజేస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. అనేక సమస్యలకు కారణం అవుతుంది.

బద్ధకాన్ని ఇలా తరిమేయండి.. దినచర్యను మార్చుకోవాలి. రోజంతా చేసే పనిపై నిమగ్నమై ఉండాలి. మార్పు చిన్నదే అయినప్పటికీ.. అది జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

మల్టిపుల్ ఆప్షన్స్: కళ్ల ముందు చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది ఎంచుకోవాలో అర్థం కాక.. చేయాల్సిన పనిని వాయిదా వేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో నచ్చిన దాన్ని ఎంచుకోవాలి. కొన్నింటిని జాబితా రెడీ చేసుకుని, వాటిలో మీకు ఏది అత్యంత ముఖ్యమైనదో నిర్ణయించుకుని ఆ పనిని పూర్తి చేయాలి.

అన్ని పనులను ఒకేసారి చేయవద్దు: అన్ని పనులను ఒకేసారి చేయొద్దు. ముందుగా సులభమైన పనిని ఎంచుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒక సమయంలో ఒక పనిని నెమ్మదిగా పూర్తి చేయాలి. అప్పుడే చేసే పనిపై దృష్టి పెట్టగలరు.

నిద్రలేమి: తగినంత నిద్ర లేకపోతే కూడా సోమరితనం ఆవరిస్తుంది. మనం అలసిపోయినప్పుడు మెదడు నెమ్మదిగా పని చేస్తుంది. అందుకే రోజూ 7-8 గంటల నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది.

మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి: మిమ్మల్ని మీరు సవాలు చేసుకోనప్పుడు, మీ జీవితంలో కొత్త ఆలోచనలు జరగనప్పుడు సహజంగానే సోమతనం పెరుగుతుంది. అందుకే ముందుగా మీతో మీరు ఛాలెంజ్ చేసుకోండి. మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఉత్సాహంగా ఉండి.. నిర్దేశించి లక్ష్యాన్ని చేరుకోవాలి. అయితే, చాలాకాలంగా బద్ధకంగా ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..