దేశంలో ఒకేసారి నాలుగు వైరస్‌లు దాడి.. త్వరలో కొత్త మహమ్మారి రానుందా..!
ప్రస్తుతం చండీపురా, నిపా, జికా, కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీటిల్లో కోవిడ్ కేసులు చాలా తక్కువ.. అదే సమయంలో చండీపురా, జికా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు.. రాబోయే రోజుల్లో పెను ప్రమాదం సృష్టించానున్నయా అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చండీపురా వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 27 మంది పిల్లలు మరణించారు. ఈ వైరస్ కేసు గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన తర్వాత.. క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి ఈ వైరస్ బాధిత పిల్లల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు.
ఇప్పుడు భారత్‌లో ఏకకాలంలో నాలుగు వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తరిస్తుండడంతో ప్రజలు బాధితులుగా మారుతున్నారు. ఈ నాలుగు వైరస్‌లు పాతవే అయినప్పటికీ, వాటి కేసులు బాధితుల సంఖ్య గతం కంటే ఎక్కువ. అంతేకాదు ఈ వైరస్ బారిన పడి ప్రజలు కొందరు మరణిస్తున్నారు. దీంతో నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం చండీపురా, నిపా, జికా, కోవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీటిల్లో కోవిడ్ కేసులు చాలా తక్కువ.. అదే సమయంలో చండీపురా, జికా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు.. రాబోయే రోజుల్లో పెను ప్రమాదం సృష్టించానున్నయా అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చండీపురా వైరస్ గురించి మాట్లాడుతూ ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు 27 మంది పిల్లలు మరణించారు. ఈ వైరస్ కేసు గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన తర్వాత.. క్రమంగా ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి ఈ వైరస్ బాధిత పిల్లల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు.
చండీపురా వైరస్ అంటే ఏమిటి?
చండీపురా వైరస్ చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో మొదలయ్యే ఈ వైరస్ మెదడుపై దాడి చేస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే.. 48 గంటల్లోనే పిల్లలు మరణించ వచ్చు. చాలా సందర్భాలలో ఈ వైరస్ మెదడును ప్రభావితం చేస్తుంది. చండీపురా వైరస్ మరణాల రేటు 85 శాతం.. అంటే ప్రతి 100 మంది సోకిన బాధితుల్లో 85 మంది చనిపోయే అవకాశం ఉంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించనప్పటికీ.. దీన్ని వ్యాప్తి చేసే ఈగలు, దోమలు వలన చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుంది.
ప్రాణాంతకంగా మారుతున్న నిపా
కేరళలో నిపా వైరస్ కారణంగా 14 ఏళ్ల యువకుడు మరణించాడు. కేరళలో ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని కేసులు ఉన్నాయి. అయితే యువకుల మరణం తరువాత కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. ఈ వ్యాధి సోకిన రోగితో పరిచయం ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నారు. నిపా కూడా కొత్త వైరస్ కాదు. ఇది 1998-99లో గుర్తించబడింది. ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. మనుషులకు కూడా సోకుతుంది.
పెరుగుతున్న జికా కేసులు
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దోమల వల్ల వచ్చే ఈ వ్యాధి కేసులు ఈ సీజన్ లో ఎక్కువగా నమోదవుతున్నాయి. జికా లక్షణాలు ఫ్లూ మాదిరిగానే ఉంటాయి. వీటి లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ.. ఈ జికా వైరస్ ను నివారించడానికి టీకా లేదా నివారణ కోసం సరైన ఔషధం లేదు. అటువంటి పరిస్థితిలో ఈ వైరస్ ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.
భారతదేశంలో కొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల పెరుగుదల పెద్దగా లేదు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
వైరస్‌లు కలిసి ఎందుకు పెరుగుతున్నాయంటే
వర్షాకాలంలో అనేక రకాల వైరస్‌లు యాక్టివ్‌గా మారతాయని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెచ్‌ఓడి ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ చెప్పారు. ఈ సీజన్‌లో ఏర్పడే తేమ వైరస్‌లు వృద్ధి చెందడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ సీజన్‌లో దోమలు వృద్ధి చెందుతాయి. దోమల వల్ల వచ్చే వ్యాధుల కేసులు కూడా పెరుగుతున్నాయి. చండీపురా వైరస్ కూడా ఈగలు, దోమల వల్ల వచ్చే వ్యాధి. ఇది సాధారణంగా పిల్లలకు సోకుతుంది.
చండీపురా వైరస్ పాత వైరస్ అని, అయితే ఈ ఏడాది చాలా కేసులు వస్తున్నాయని.. ఇది ప్రమాదకరమని కూడా రుజువు చేస్తోందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ వైరస్ చిన్నారులు చనిపోతున్నారు. చండీపురా వైరస్‌ను నివారించడానికి టీకా లేదా సరైన చికిత్స లేనందున.. ఈ వ్యాధి తీవ్రమైన లక్షణాలను నియంత్రించడం కష్టమవుతుంది. ఈ వైరస్ ఊపిరితిత్తులలోకి ప్రవేశించి మెదడుపై దాడి చేస్తుంది. ఒక్కోసారి మెదడుపై ఈ వైరస్ ప్రభావం పడితే రోగి ప్రాణాలను కాపాడడం కష్టమవుతుందని చెబుతున్నారు. చండీపురా వైరస్ కూడా పిల్లల్లో మెదడువాపు లాంటిదే.
నిపా, జికాలతో ప్రమాదం ఏమిటంటే?
వర్షం, నీరు చేరడం వల్ల వైరస్‌లు యాక్టివ్‌గా మారతాయని లేడీ హార్డింజ్ హాస్పిటల్ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి అంటున్నారు. ఈ సీజన్ ఫ్లూకి అనుకూలమైనది. దీని వల్ల దగ్గు, జలుబు, జ్వరం కేసులు పెరుగుతాయి. దగ్గు, జలుబు కారణంగా కూడా వైరస్‌లు సులభంగా సంక్రమిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి జికా వైరస్ సోకి దగ్గు వస్తే దీని వైరస్ సమీపంలోని వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఈ సీజన్‌లో వైరస్‌లు సులభంగా వ్యాపిస్తాయి. కేసులు పెరుగుతాయి. ఈ సమయంలో వివిధ వైరస్‌ల కేసులు పెరగడానికి ఇదే కారణం.
కొత్త అంటువ్యాధి వచ్చే ప్రమాదం ఉందా?
ఈ సీజన్ లో వైరస్ లు యాక్టివ్ గా మారతాయని డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో వీటిని నివారణ అవసరం. అయితే ప్రస్తుతానికి కొత్త అంటువ్యాధి వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వైరస్ కేసులు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న వైరస్ కేసుల దృష్ట్యా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వైరస్ విజృంభించకుండా ఒక కన్ను వేయవలసి ఉంటుంది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతాలలో వైరస్ వ్యాప్తిని నియంత్రించవలసి ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..