- Telugu News Photo Gallery Spiritual photos Travel India: 5 oldest and holiest places in India one must visit once in a lifetime
Holy Places in India: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాల్సిన పవిత్ర స్థలాలు.. ఏమిటో తెలుసా!
భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. దేవతలు, దేవతకలు నడయాడిన భూమి. కర్మ సిద్ధాతం నమ్మే ప్రజలు.. దేవుడి అత్యంత భక్తి శ్రద్దలతో పుజిస్తారు. మానసిక ప్రశాంత కోసం, పుణ్యం పురుషార్ధం అంటూ అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఆర్ధిక శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తారు. అయితే ఎక్కువ మంది రణగొణ ధ్వనులకు, బిజీ లైఫ్ కు దూరంగా కొన్ని రోజులైనా గడపాలని కోరుకుంటారు. అందుకు తరచుగా పవిత్ర పుణ్యక్షేత్రాలను అన్వేషణ చేస్తారు. దేశంలో అనేక పవిత్ర ఆలయాలను సందర్శిస్తారు. దేశం విభిన్న మత సంప్రదాయాలకు నిలయంగా ఉంది. దేశ విదేశాలనుంచి భారీ సంఖ్యలో సందర్శించాలనుకునే పురాతన పవిత్ర ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఐదు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా తప్పక సందర్శించాలి., అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jul 22, 2024 | 2:43 PM

తిరుపతి, ఆంధ్రప్రదేశ్: కలియుగ వైకుంఠం తిరుమల. ఇక్కడ పురాతనమైన శ్రీ వేంకటేశ్వర దేవాలయం ఉంది. మలయప్ప స్వామి, వెంకన్న, బాలాజీ శ్రీవారు ఇలా అనేక పేర్లతో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు వేంకటేశ్వరుడు. ఈ ఆలయం కలియుగ దైవం గా ఖ్యాతిగాంచిన వెంకన్న రూపంలో విష్ణువుకు అంకితం చేయబడింది. తిరుమల కొండలపై ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే తీర్థయాత్ర క్షేత్రాల్లో ఒకటి. రోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.

రిషికేశ్, ఉత్తరాఖండ్: గంగా నది ఒడ్డున హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్న రిషికేశ్ "ప్రపంచంలోని యోగా రాజధాని"గా ప్రసిద్ధి చెందింది. ఆధ్యాత్మిక అన్వేషకులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా నిలిచింది. పట్టణం ఆశ్రమాలు, దేవాలయాలు, యోగా కేంద్రాలతో నిండి ఉంది. ఇక్కడ సందర్శకులు యోగా , ధ్యానంతో మనసుని, శరీరాన్ని రిచర్జ్ చేసుకోవచ్చు. ప్రకృతి అందాలు కూడా కనుల విందు చేస్తాయి.

బోధ్ గయా, బీహార్: 2500 సంవత్సరాల క్రితం బోధి వృక్షం క్రింద బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశంగా బోధ్ గయకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. మహాబోధి ఆలయ సముదాయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. బోధి వృక్షాన్ని కలిగి ఉన్న ఈ గయా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ యాత్రికులను ఆకర్షిస్తుంది. బోధి వృక్షం క్రింద ధ్యానం చేయడం, బోధ్ గయలోని నిర్మలమైన మఠాలను సందర్శించడం మంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి.

అమృత్‌సర్, పంజాబ్: అమృతసర్ సిక్కు మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గోల్డెన్ టెంపుల్ (హర్మందిర్ సాహిబ్) పర్యాటకులను ఆకర్షిస్తుంది. పవిత్రమైన అమృత సరోవరం (మకరందపు కొలను)తో పసిడి పూసిన ఆలయం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అన్ని మతాల ప్రజలు ఇక్కడ ఉచిత సామూహిక భోజనం (లంగర్)లో పాల్గొంటారు. ఇది సమానత్వం, సేవను తెలిపే సిక్కు మత సూత్రాలను అనుభవించడానికి స్వాగతించింది.

వారణాసి (కాశీ), ఉత్తరప్రదేశ్: పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన నగరం. యాత్రికులు, పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు ఇక్కడికి వస్తుంటారు. దశాశ్వమేధ ఘాట్‌లో ప్రతిరోజూ సాయంత్రం జరిగే గంగా ఆరతి వేడుకను చూడడం ఓ అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది.




