Cervical Cancer: గర్భాశయ క్యాన్సర్ గురించి అసలైన వాస్తవాలు ఏంటో తెలుసుకోండి!
క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఈ మహమ్మారి రోగిని శారీరకంగానే కాదు.. మానసికంగానూ కుంగదీస్తుంది. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి గర్భాశయ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్). క్యాన్సర్లు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ల బారిన పడి పోరాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. అలాగే ఈ గర్భాశయ క్యాన్సర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ నయం కాదని చాలా మంది అపోహలో ఉంటూ ఉంటారు. అయితే ముంబైకి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్..

క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఈ మహమ్మారి రోగిని శారీరకంగానే కాదు.. మానసికంగానూ కుంగదీస్తుంది. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి గర్భాశయ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్). క్యాన్సర్లు ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ల బారిన పడి పోరాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కువ మంది మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. అలాగే ఈ గర్భాశయ క్యాన్సర్ గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ నయం కాదని చాలా మంది అపోహలో ఉంటూ ఉంటారు. అయితే ముంబైకి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మేఘల్ సంఘవి చెబుతున్న దాని ప్రకారం.. గర్భాశయ క్యాన్సర్‌ను నయం చేయడమే కాకుండా.. ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
లైంగిక సంబంధం ఉన్న ఎవరికైనా రావొచ్చు..
ఇప్పుడొచ్చిన అధునాతన స్క్రీనింగ్ పద్దతులతో గర్భాశయ క్యాన్సర్ ఏ దశల్లో ఉందో గుర్తించి అందుకు తగ్గట్టుగా చికిత్స కూడా అందించవచ్చని పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవ్యక్తులతో పాటు లైంగిక సంబంధం ఉన్న ఎవరికైనా రావొచ్చు. అలాగే గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా టీకాలు వేసిన వ్యక్తులు వ్యాధి నుండి పూర్తిగా రక్షించబడతారని దాని వల్ల వాళ్లకు స్క్రీనింగ్ అవసరం లేదని అంటూ ఉంటారు.
టీకాలు ఎఫెక్టీవ్‌గా పని చేసినా టీకాలు అవసరం..
నిజానికి గర్బాశయ క్యాన్సర్ టీకాలు ప్రభావవంతంగా పని చేసినప్పటికీ.. అవి ఫూల్ ప్రూఫ్ కదు. పాప్ సెర్మ్ వంటి సాధారణ స్క్రీనింగ్ పద్దతులకు టీకా ప్రత్యామ్యాయం కాదని గుర్తించడం చాలా అవసరం. వ్యాక్సిన్ స్క్రీనింగ్ ప్రయత్నాలను పూర్తి చేస్తుంది. అలాగే గర్భాశయ క్యాన్సర్ నుండి అదనపు రక్షణ కూడా ఇస్తుంది. కానీ పూర్తి స్థాయిలో సంపూర్ణ రోగ నిరోధక శక్తికి హామీ ఉండదు.
ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ అపోహలను పరిష్కరించడంలో సమర్థవంతమైన గర్భాశయ క్యాన్సర్ నివారణకు బహుముఖ విధానం అవసరమని స్పష్టమవుతుంది. సామాజిక – ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా స్క్రీనింగ్ ద్వారా ముందస్తుగా గుర్తించడం చాలా అవసరం. స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్యాన్సర్ వంటి ప్రాణాంత వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందుగానే ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. మీ లైఫ్ స్టైల్‌లో, తీసుకునే ఆహారంలో పలు మార్పులు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








