AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall Control Tips: శీతాకాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలు.. మీకోసమే ప్రత్యేకం!

జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. వాతావరణంలో మార్పుల వల్ల లేదా శరీరంలోని అనేక సమస్యల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. అందులోనూ చలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ పెరిగి పోవడం వల్ల జుట్టు పొడి బారిపోయి.. చిట్లి పోతుంది. ఈ కాలంలో ఎక్కువగా జుట్ట డ్యామేజ్‌కి గురవుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని అదుపు చేయవచ్చు. అవేంటో..

Hair Fall Control Tips: శీతాకాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలు.. మీకోసమే ప్రత్యేకం!
Hair Fall Control
Chinni Enni
|

Updated on: Jan 10, 2024 | 5:43 PM

Share

జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. వాతావరణంలో మార్పుల వల్ల లేదా శరీరంలోని అనేక సమస్యల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. అందులోనూ చలి కాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ పెరిగి పోవడం వల్ల జుట్టు పొడి బారిపోయి.. చిట్లి పోతుంది. ఈ కాలంలో ఎక్కువగా జుట్ట డ్యామేజ్‌కి గురవుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలడాన్ని అదుపు చేయవచ్చు. అవేంటో ఇప్పుడు ఓ లుక్ వేసేద్దాం.

వెచ్చని నూనెతో మసాజ్:

సాధారణంగా జుట్టు ఆయిల్‌ రాస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఉపయోగించే నూనెను డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసి.. జుట్టు బాగా పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేస్తే స్కాల్ఫ్‌లో రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దీంతో జుట్టు కుదుళ్లకు బలం పెరిగి, ఊడి పోకుండా, చిట్లకుండా చూస్తుంది.

హెర్బల్ హెయిర్ మాస్క్‌లు:

ఉసిరి, వేప, మందార వంటి ఆయుర్వేద మూలికలు ఉపయోగించి.. పోషకమైన హెయిర్ మాస్క్‌ను తయారు చేసుకోవాలి. వీటిని తలకు పట్టించడం వల్ల.. జుట్టుకు బలం చేకూరుతుంది. అదే విధంగా జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా సహాయ పడతాయి. అలాగే పెరుగు లేదా కొబ్బరి నూనెలో పొడి మూలికలను కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

హైడ్రేట్‌గా ఉండాలి:

శీతా కాలపు పొడి గాలి.. నిర్జలీకరణానికి దారి తీస్తుంది. ఇది మీ శరీరం, జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి రోజంతా పుష్కలంగా నీరు తాగాలి. దీని వల్ల మీ శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. మీ స్కాల్ఫ్ పొడి బారకుండా ఉండేందుకు నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరం కూడా హైడ్రేట్ అయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి:

శరీరమైనా, జుట్టు అయినా ఆరోగ్యంగా ఉండాలంటే.. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు మంచి పోషణ అందుతుంది. మీ ఆహారంలో ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, గింజలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల మీ శరీరంతో పాటు జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..