Lip Care in Winter: పెదాలు పగులుతున్నాయా? చక్కెరలో కాసిన్ని కొబ్బరి నూనె చుక్కలు కలిపి వారానికి రెండు సార్లు..

చలికాలం వచ్చిందంటే పగిలిన పెదవులు ఇబ్బంది పెడతాయి. కొందరికి పెదవులు పగిలిపోయి రక్తస్రావం కూడా అవుతుంది. దీనితోపాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. నిజానికి ఈ సమస్య చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని వీలైనంత ఎక్కువగా హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. పెదాలను కూడా తేమగా ఉంచుకోవాలి. చలికాలంలో పెదాలు మృదువుగా ఉండాలంటే పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని..

Srilakshmi C

|

Updated on: Jan 10, 2024 | 7:12 PM

చలికాలం వచ్చిందంటే పగిలిన పెదవులు ఇబ్బంది పెడతాయి. కొందరికి పెదవులు పగిలిపోయి రక్తస్రావం కూడా అవుతుంది. దీనితోపాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. నిజానికి ఈ సమస్య చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని వీలైనంత ఎక్కువగా హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. పెదాలను కూడా తేమగా ఉంచుకోవాలి.

1 / 5
చలికాలంలో పెదాలు మృదువుగా ఉండాలంటే పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు పెదవులు పగలకుండా తడిగా ఉంటాయి.

2 / 5
అలాగే కొబ్బరి నూనెలో పంచదార కలిపి పెదవులపై స్క్రబ్‌ చేసుకోవాలి. ఇది పెదవుల పగుళ్లను తొలగిపోతుంది. ముందుగా చేతిలో కొంచెం చక్కెర తీసుకుని, అందులో రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసి, పెదవులపై స్క్రబ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడిగేయాలి.

3 / 5
చలికాలంలో పెదాలను రక్షించుకోవడానికి పాల ఉత్పత్తులను తినాలి. అలాగే పచ్చి పాలతో పెదవులపై మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. నిమ్మరసం కూడా బాగా పని చేస్తుంది. ఒక స్పూన్‌ బాదం నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి పెదవులపై అప్లై చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి.

4 / 5
చలికాలంలో మీ పెదాలను రక్షించుకోవడానికి ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను పెదవులపై మసాజ్ చేసుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది పెదాలను మృదువుగా, అందంగా మారుస్తుంది. పెదాలను మృదువుగా చేయడానికి బీట్‌రూట్ రసంలో తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. వారానికి ఒకటి రెండు రోజులు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow us