వంటకి నూనె అవసరం. నూనె లేకుండా ఏ వంట చేయలేం. అలాగే నూనె కూడా శరీరానికి అవసరం. నూనె లేని ఆహారం మాత్రమే తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే పూర్తిగా నూనెలో వేయించిన ఆహారం తీసుకున్నా జీర్ణం కాదు. కడుపు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తక్కువ నూనెలో లైట్‌గా వేయించిన ఆహారం తినవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.