AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Disease: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..

మూత్రపిండాల వ్యాధిని తరచుగా నిశ్శబ్ద వ్యాధిగా పరిగణిస్తారు. ఎందుకంటే లక్షణాలు చాలా ఆలస్యంగా కనిపిస్తాయి. 70-80% కిడ్నీ పనితీరు కోల్పోయిన తర్వాతే స్పష్టమైన సంకేతాలు వెల్లడవుతాయి. మధుమేహం, అధిక రక్తపోటు ప్రధాన కారణాలు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి, చికిత్స తీసుకోవడం అత్యవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Kidney Disease: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నిలు కొట్టేసినట్లే.. ఆలస్యం చేస్తే..
Kidney Health
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2026 | 4:08 PM

Share

మూత్రపిండాల వ్యాధిని వైద్య పరిభాషలో తరచుగా నిశ్శబ్ద వ్యాధిగా అభివర్ణిస్తారు. ఇతర అవయవాల సమస్యలు త్వరగా సంకేతాలను ఇవ్వగా, మూత్రపిండాల వ్యాధి లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి. 70 నుంచి 80 శాతం కిడ్నీ పనితీరు కోల్పోయిన తర్వాతే స్పష్టమైన సూచనలు కనిపిస్తాయి. అప్పటివరకు సాధారణ రక్త పరీక్షలలో కూడా గుర్తించడం కష్టం కావచ్చు. ప్రారంభ లక్షణాలు తరచుగా నాన్-స్పెసిఫిక్‌గా ఉంటాయి. ఆకలి మందగించడం, అలసట, ఏకాగ్రత లోపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉండవచ్చు. చాలామంది వీటిని నిద్రలేమి లేదా ఇతర చిన్నపాటి సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కిడ్నీ పనితీరు 90 శాతం కంటే తగ్గితేనే రక్తహీనత, తీవ్రమైన ఆయాసం, వాంతులు, ఫిట్స్ లేదా స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు తలెత్తుతాయి. రక్తహీనత మూత్రపిండాల వ్యాధితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. మూత్రపిండాలు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇది రక్త కణాల ఉత్పత్తికి కీలకం. కిడ్నీలు పనిచేయకపోతే, ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గి రక్తహీనత ఏర్పడుతుంది. చాలామంది రక్తహీనతకు సాధారణ మందులు వాడినా, మూలకారణమైన కిడ్నీ సమస్యను గుర్తించరు. ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్ (ESRD) అంటే కిడ్నీ పనితీరు 10 శాతం కంటే తక్కువగా ఉన్న స్థితికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. 60-70 శాతం కేసులలో, మధుమేహం (డయాబెటిస్), అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ సమస్య వస్తుంది. ఈ రెండూ కూడా సైలెంట్ డిసీజ్‌లు కావడంతో, చాలామందికి తమకు ఈ వ్యాధులు ఉన్నాయని కూడా తెలియదు.

మిగిలిన 30 శాతం కేసులలో, పదేపదే కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంటి వంశపారంపర్య వ్యాధులు లేదా దీర్ఘకాలిక పెయిన్‌కిల్లర్స్ (ఎన్‌ఎస్‌ఏఐడీలు) వంటి మందుల దుర్వినియోగం కారణాలుగా ఉంటాయి. తలనొప్పి లేదా కీళ్ల నొప్పులకు కారణాన్ని గుర్తించకుండా దీర్ఘకాలం మందులు వాడటం కిడ్నీలను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు, కానీ కారణాలు మారుతూ ఉంటాయి. చిన్నపిల్లలలో (1-2 సంవత్సరాల నుండి 10-12 సంవత్సరాల వరకు) వంశపారంపర్య సమస్యలు లేదా పుట్టుకతో వచ్చే మూత్రపిండ లోపాలు కారణం కావచ్చు. 55-60 సంవత్సరాల వయస్సు వారిలో మధుమేహం, అధిక రక్తపోటు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. స్త్రీలలో లూపస్ ఎరిథెమాటోసస్ (SLE), రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇమ్యునోలాజికల్ డిజార్డర్స్ వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినవచ్చు. ఒక కిడ్నీతో జీవించడం సాధ్యమేనా అనే ప్రశ్నకు, అవును అని సమాధానం. ఒక కిడ్నీ బాగా పనిచేస్తే, సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అందుకే కిడ్నీ మార్పిడిలో కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేయడం జరుగుతుంది. కొందరికి పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉంటుంది లేదా చిన్నతనంలో ఒక కిడ్నీ పాడైపోవచ్చు. 90 శాతం మందిలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే, 10 శాతం మందిలో ఒకే కిడ్నీపై అధిక భారం పడటం వల్ల అది కూడా కాలక్రమేణా పనితీరును కోల్పోయే అవకాశం ఉంది. కిడ్నీ ఆరోగ్యానికి హానికరం కాని జీవనశైలి మార్పులు అవసరం.

అధిక ఉప్పు వినియోగం, ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారిలో, కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సాధారణంగా రోజుకు 6-8 గ్రాముల ఉప్పు తీసుకునే ఇండియన్ డైట్‌లో, హైపర్‌టెన్షన్ ఉన్నవారు 4-5 గ్రాములకు తగ్గించడం రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. ప్రోటీన్ ఆహారం గురించి చాలా అపోహలు ఉన్నాయి. కిడ్నీ వ్యాధి ఉన్నవారు ప్రోటీన్ తీసుకోవడం పూర్తిగా మానేయకూడదు. శరీర బరువుకు సరిపడా (కిలో శరీర బరువుకు 1 గ్రాము) ప్రోటీన్ అవసరం. ఇండియన్ డైట్‌లో పప్పులు లేదా గుడ్లు తప్ప అధిక ప్రోటీన్ సాధారణంగా ఉండదు. మాంసాహారం లేదా పాల ఉత్పత్తులు అధికంగా తీసుకునేవారికి మాత్రమే ప్రోటీన్ నియంత్రణ అవసరం. ధూమపానం, ఇతర పొగాకు ఉత్పత్తులు కిడ్నీలకు అత్యంత హానికరం. కిడ్నీ పనితీరు 50 శాతం ఉన్న ఇద్దరు వ్యక్తులలో, ధూమపానం చేసే వ్యక్తి 1-2 సంవత్సరాలలోనే ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్ కు చేరుకునే అవకాశం ఉంది, ధూమపానం చేయని వ్యక్తి ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే, మధుమేహం, అధిక రక్తపోటులను సమర్థవంతంగా నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, అవగాహన కలిగి ఉండటం.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(Note: ఈ సమాచారం వైద్య నిపుణులు నుంచి సేకరించబడింది. మీకు ఏ సమస్య, అనుమనాలున్నా.. వైద్యులను సంప్రదించండి)

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?