AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెల రోజులు ఆల్కహాల్ తీసుకోవడం మానేసి చూడండి..! మీ శరీరంలో జరిగేది ఇదే..

మద్యపానం 30 రోజులు ఆపేయడం వలన మెదడు, కాలేయ పనితీరు అద్భుతంగా మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మద్యపానం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నొక్కి చెబుతోంది. ఇది మానసిక ఆరోగ్యం, నిద్ర నాణ్యతను పెంచుతుంది, నిద్రలేమి, అధిక బరువు వంటి సమస్యలను నివారిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఇదొక ముఖ్యమైన అడుగు.

నెల రోజులు ఆల్కహాల్ తీసుకోవడం మానేసి చూడండి..! మీ శరీరంలో జరిగేది ఇదే..
Alcohol
Jyothi Gadda
|

Updated on: Jan 07, 2026 | 2:11 PM

Share

మద్యం సేవించడం 30 రోజులు మానేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో ముందుగా నష్టపోయేది, కాలేయమే. మందు తాగడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది. నెల రోజులు మందు మానేస్తే కాలేయం కాస్త కోలుకుంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్కహాల్ తాగడం వల్ల మెటబాలిజం రేటు మందగించి కేలరీల ఖర్చు తగ్గిపోతుంది. దీంతో పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. అయితే నెల రోజులు ఆల్కహాల్ మానేసి చూడండి. పొట్ట తగ్గడం మీరే గమనిస్తారు

మద్యం తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందన్నది మీ అపోహ మాత్రమే. డీహైడ్రేషన్, మూత్రం రావడం, దాహం వేయడం వంటి కారణాలతో అర్ధరాత్రి మెలకువ వస్తుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. అదే మద్యం మానేస్తే మెదడు ఉల్లాసంగా ఉంటుంది. మంచి నిద్ర పొందవచ్చు. మద్యం తాగడం వల్ల శరీరంలో ఇంఫ్లమేషన్ పెరిగి చర్మంపై తొందరగా ముడతలు వస్తాయి. అలాగే డీహైడ్రేషన్ వల్ల ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఒకవేళ మీరు నెల రోజుల పాటు మద్యం మానేస్తే చర్మానికి రక్త ప్రసరణ బాగా జరిగి స్కిన్ గ్లో పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఒత్తిడి తగ్గేందుకు మద్యం తాగుతున్నామని కొంతమంది చెబుతుంటారు. కానీ మద్యం తాగితేనే ఒత్తిడి మరింత పెరుగుతుంది. నెల రోజుల పాటు ఆల్కహాల్ మానేసి చూడండి మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మద్యం తాగడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. కండలు ముట్టుకుంటే మెత్తగా, నొప్పిగా అనిపిస్తాయి. అదే ఆల్కహాల్ మానేస్తే కండరాల బలం పెరుగుతుంది. బాడీ కూడా ఫిట్‌గా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మద్యం తాగే వారిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కోపం, చికాకు, బాధ..ఇలా తరచూ ఏదో ఒక రకంగా ఇబ్బందిపడుతుంటారు. కానీ మద్యం మానేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. ఆల్కహాల్ తాగేవారు బలహీనంగా ఉంటారు. బలం తగ్గిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మీరు నెల రోజులు మద్యం మానేసి చూడండి. శరీరం బలంగా అనిపిస్తుంది. హెల్తీగా కనిపిస్తారు. ఆల్కహాల్ తాగడం వల్ల మీకు తెలియకుండానే మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తూ వస్తుంది. తాగాలన్న కోరికతో ఎక్కువగా ఖర్చుపెడతారు. కానీ నెల రోజులు మద్యం మానేసి చూడండి. కచ్చితంగా మీ జేబులో డబ్బు నిలుస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!