Kerala Hair Oil: కేరళ స్టైల్‌లో ఆయిల్ ఇలా తయారు చేస్తే.. జుట్టు పెరుగుతూనే ఉంటుంది!
చాలా మందికి తెలిసే ఉంటుంది కేరళలో లేడీస్ జుట్టు పొడుగ్గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటే.. చాలా అందంగా ఉంటుంది. జుట్టు వల్ల మరింత అందంగా కనిపిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు ఊడి పోవడం, పలుచబడటం, చుండ్రు, మధ్యలో జుట్టు విరిగి పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. పోషకాహార లోపం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ..

చాలా మందికి తెలిసే ఉంటుంది కేరళలో లేడీస్ జుట్టు పొడుగ్గా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా ఉంటే.. చాలా అందంగా ఉంటుంది. జుట్టు వల్ల మరింత అందంగా కనిపిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది జుట్టు ఊడి పోవడం, పలుచబడటం, చుండ్రు, మధ్యలో జుట్టు విరిగి పోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. పోషకాహార లోపం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యల నుంచి బయట పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా రావాలంటే కేరళీయులు వాడే ఆ హెయిర్ ఆయిల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆయిల్ వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పొడుగ్గా తయారవుతుంది. ఈ నూనె తయారు చేసుకోవడం చాలా సులభం. కేరళ వారు ఈ ఆయిల్‌నే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరి కేరళ స్టైల్ లో ఆయిల్ ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
కేరళ స్టైల్ హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన పదార్థాలు:
కొబ్బరి నూనె – 500 ఎమ్ఎల్, కరివేపాకు – గుప్పెడు, మెంతులు – ఒక టేబుల్ స్పూన్, మందార ఆకుల పొడి – ఒక టేబుల్ స్పూన్, కలబంద గుజ్జు – ఒక టేబుల్ స్పూన్, చిన్న ఉల్లి పాయలు చిన్నవి – 10, మిరియాల గింజలు – 10.
కేరళ స్టైల్ హెయిర్ ఆయిల్ తయారీ విధానం:
ముందుగా ఒక జార్‌లో కరివేపాకు ఆకులు, ఉల్లి పాయలు, మందార ఆకుల పొడి, మెంతులు, కలబంద గుజ్జు వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇనుప కడాయి తీసుకుని అందులో ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి నూనె వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత మిరియాలు కూడా వేసి మరో రెండు నిమిషాలు మరిగించాలి. ఈ ఆయిల్‌ని బాగా చల్లార్చాలి. చల్లారిన తర్వాత వడకట్టి నిల్వ చేసుకోవాలి.
ఈ ఆయిల్‌ని తలకు పట్టించే ముందు ఒకసారి గోరు వెచ్చగా డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకుని కుదుళ్ల నుంచి చివర్ల వరకు సున్నితంగా మర్దనా చేస్తూ.. బాగా పట్టించాలి. దీన్ని అరగంట పాటు అలాగే ఉంచుకుని, తర్వాత తల స్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే జుట్టు కుదుళ్లకు తగిన పోషకాలు అంది.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలతో బాధ పడేవారు ఈ ఆయిల్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.