నంద్యాల జిల్లా డోన్ ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ రూ.30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. రిటైర్డ్ ఉద్యోగి శ్యామరాజు పెన్షన్ మంజూరు కోసం లక్ష్మణ్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేయగా, శ్యామరాజు ఏసీబీని ఆశ్రయించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన లక్ష్మణ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.