AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే కలెక్షన్ల సునామీ.. అన్నగారి బ్లాక్ బాస్టర్

ఎన్టీఆర్ నటించిన డ్రైవర్ రాముడు చిత్రం 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో, 265వ చిత్రంగా ఎన్టీఆర్ నటించారు. కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అనేక కేంద్రాలలో వంద రోజులు ఆడి, బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది.

Tollywood: 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే కలెక్షన్ల సునామీ.. అన్నగారి బ్లాక్ బాస్టర్
Jayasudha and Sr NTR in Driver Ramudu Film
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2025 | 2:20 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు దివంగత సీనియర్ ఎన్టీఆర్ నటించిన అద్భుత చిత్రాలలో డ్రైవర్ రాముడు ఒకటి. 1979 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం.. 2025 ఫిబ్రవరికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1978 అక్టోబర్ నుంచి 1979 ఏప్రిల్ నెలాఖరు వరకు మూడు చిత్రాలను విడుదల చేయాలనే ఎన్టీఆర్ సంకల్పానికి అనుగుణంగా, రెండు పౌరాణిక చిత్రాలైన శ్రీమద్ విరాటపర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంల మధ్య ఒక కమర్షియల్ చిత్రంగా డ్రైవర్ రాముడును రూపొందించారు. ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను.. అప్పటి యువ దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు అప్పగించారు. ఎన్టీఆర్ సొంత సంస్థలోకి రాఘవేంద్రరావు తొలిసారిగా అడుగుపెట్టారు. డ్రైవర్ రాముడు ఎన్టీఆర్ 265వ చిత్రంగా తెరకెక్కింది. లారీ డ్రైవర్‌గా, స్వయంకృషితో లారీ ఓనర్ స్థాయికి ఎదిగే పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆయన సరసన జయసుధ, సోదరిగా రోజారమణి, ఆమె భర్తగా శ్రీధర్ నటించారు. కైకాల సత్యనారాయణ మరో లారీ డ్రైవర్‌గా, విలన్లుగా రావు గోపాలరావు, మోహన్ బాబు తండ్రీకొడుకుల పాత్రల్లో మెప్పించారు.

1978 అక్టోబర్ 16న కృష్ణా జిల్లాలోని తేలప్రోలు గ్రామంలో డ్రైవర్ రాముడు షూటింగ్ ప్రారంభమైంది. చిత్రం షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. అరకులోయలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రాలలో ఇది ఒకటి. అక్కడ మూడు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. “దొంగా దొంగా దొరికింది దొంగల బండి ఎక్కింది” పాటను ట్రైన్‌లో చిత్రీకరించడం అప్పట్లో విశేషం. సంగీత దర్శకుడు చక్రవర్తి అందించిన పాటలు మంచి విజయం సాధించాయి. బుర్రా కేవ్స్‌లో షూటింగ్ చేసిన ఘనత కూడా ఈ చిత్రానిదే. లోతట్టు ప్రాంతాల్లో షూటింగ్ సౌకర్యాల కోసం ఎన్టీఆర్ స్వయంగా కంకర రోడ్లు వేయించారు. డ్రైవర్ రాముడు చిత్రం తర్వాత అరకులోయ ఒక ఫేమస్ షూటింగ్ స్పాట్‌గా మారింది. ఈ చిత్రం కైకాల సత్యనారాయణకు 300వ సినిమా. కేవలం 28 రోజుల్లోనే మూడు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తవడం విశేషం. 1979 సంక్రాంతికి విడుదల చేయాలని తొలుత భావించినా, ఫిబ్రవరి 2న విడుదలైంది. ఆంధ్రాలో విజయ పిక్చర్స్ ద్వారా, నైజాంలో శ్రీ నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ ద్వారా ఎన్టీఆర్ స్వయంగా రిలీజ్ చేశారు. డొరస్వామిరాజు రాయలసీమలో ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు.

డ్రైవర్ రాముడు విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, ఒంగోలు, మచిలీపట్నం, తిరుపతి, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, వరంగల్, హైదరాబాద్ వంటి కేంద్రాలలో వంద రోజులు ఆడింది. తిరుపతిలో 25 వారాలు, విజయవాడలో షిఫ్టింగ్లతో 25 వారాలు ఆడింది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 1984లో స్లాబ్ సిస్టం వచ్చాక సెకండ్ రిలీజ్‌లో కూడా డ్రైవర్ రాముడు విజయవాడలో 50 రోజులు ఆడి బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము దులిపేసింది. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉన్నప్పుడే కృష్ణతో “లారీ డ్రైవర్” అనే మరో చిత్రం నిర్మించే ప్రయత్నాలు జరిగాయి, కానీ డ్రైవర్ రాముడు విజయంతో ఆ ప్రయత్నాలు పక్కకు పెట్టబడ్డాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి. 

దటీజ్ ఎన్టీఆర్.. 28 రోజుల్లో తీసిన సినిమాకు కలెక్షన్ల సునామీ..
దటీజ్ ఎన్టీఆర్.. 28 రోజుల్లో తీసిన సినిమాకు కలెక్షన్ల సునామీ..
ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు
ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు
తెలంగాణలో క్రిస్మస్ సెలవులపై కీలక అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
తెలంగాణలో క్రిస్మస్ సెలవులపై కీలక అప్డేట్.. ఎన్ని రోజులంటే..?
యూరియా బుకింగ్ షురూ.. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అంటే
యూరియా బుకింగ్ షురూ.. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అంటే
చీకటిపడితే బల్లిగా మారే జనాలు..! ఇదెక్కడి మాయరోగం రా సామీ..?
చీకటిపడితే బల్లిగా మారే జనాలు..! ఇదెక్కడి మాయరోగం రా సామీ..?
ఆ పరిశోధనతో నోబెల్ సాధిస్తే.. రూ. 100 కోట్లు మీవే..
ఆ పరిశోధనతో నోబెల్ సాధిస్తే.. రూ. 100 కోట్లు మీవే..
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్‌..
ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్‌..
కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు
కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు
కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం!
కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం!
మీ ఛార్జర్ ఒరిజినల్‌దా..? లేక నకిలీదా..? ఇలా సులువుగా కనిపెట్టండి
మీ ఛార్జర్ ఒరిజినల్‌దా..? లేక నకిలీదా..? ఇలా సులువుగా కనిపెట్టండి