Health Tips: బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం అవుతోందా.! ఎంత డేంజరో తెలుసా..? షాకింగ్ విషయాలు..
మన భోజనానికి మన ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యంలో మార్పులు వస్తుంటాయి. మన రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ సమయాన్ని బట్టి గుండె జబ్బుల బారినపడే ఛాన్స్ ఉంది అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా గ్లోబల్ డిసీజ్ బర్డెన్ 2020 చేసిన పరిశోధనలో...

మన భోజనానికి మన ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. మనం తినే ఆహారం బట్టి మన ఆరోగ్యంలో మార్పులు వస్తుంటాయి. మన రాత్రి భోజనం, ఉదయం టిఫిన్ సమయాన్ని బట్టి గుండె జబ్బుల బారినపడే ఛాన్స్ ఉంది అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా గ్లోబల్ డిసీజ్ బర్డెన్ 2020 చేసిన పరిశోధనలో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు బయటపడ్డాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్ష మందిలో 235 మంది గుండె సంబధిత జబ్బులతో చనిపోతున్నారు. మన ఇండియాలో మాత్రం అది 272గా ఉంది. ఈ సర్వే ద్వారా భోజనం చేసే సమయాన్ని గుండె జబ్బులపై సర్వే చేశారు పరిశోధకులు. ఈ అధ్యయనంలో ఉదయం టిఫిన్ చేయకుండా లేట్‌గా భోజనం చేసేవారిలో ఎక్కువ సమస్య ఉంది అని తేలింది. ఉదయం టిఫిన్ 8 గంటలకు చేసేవారి కంటే 9 గంటలకు టిఫిన్ చేసేవారిలో 6శాతం గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది అని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అలాగే రాత్రి 8 గంటల కల్లా డిన్నర్ చేసేవారితో పోల్చితే.. 9 గంటల తర్వాత డిన్నర్ చేసేవారిలో 28 శాతం మందికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్‌లు అంటున్నాయి.
ఈ సమస్య లేడీస్‌లో ఎక్కువ ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు నైట్ భోజనం ఉదయం టిఫిన్‌కి మధ్య గ్యాప్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని ఒక రిపోర్ట్. ఈ పరిశోధన ప్రకారం నైట్ డిన్నర్‌కి.. ఉదయం టిఫిన్‌కి 12 గంటల గ్యాప్ ఉంటే మంచి ఉపయోగం ఉంటుందని.. దీని వల్ల బీపీ, హార్ట్ ఎటాక్ లాంటివి తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2020లో కోటికి పైగా గుండె సమస్యతో చనిపోతే.. అందులో ఇండియాలో 5వ వంతు ఉన్నారని రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇందులో ఎక్కువగా యువత ఉన్నారని.. సరైన ఆహార అలవాట్లు, సమయానికి భోజనం చేయకపోవడం వల్లే ఇవి జరుగుతున్నాయని వైద్యులు సైతం ఎప్పటి నుంచో చెబుతున్నారు. తాజా సర్వే రిపోర్ట్‌ల ప్రకారం భోజనానికి, గుండె సమస్యలకి సంబంధం లేకపోలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.




