25 ఏళ్లలో ఎన్నాడూ చూడని హిమపాతం..! రోడ్డుపై స్తంభించి పోయిన 1000కి పైగా వాహనాలు..
రెస్క్యూ టీమ్ వాహనాల్లో చిక్కుకున్న వ్యక్తులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేసింది రెస్క్యూ టీం. రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో పలు వాహనాలు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ వర్కర్లు మంచును తొలగిస్తున్నప్పటికీ, భారీ మంచు కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరమైంది.
దక్షిణ స్వీడన్‌లోని స్కేన్ ప్రాంతంలోని ప్రధాన రహదారి అయిన E22లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి రెస్క్యూ బృందాలు రాత్రంతా పని చేయాల్సి వచ్చింది. స్వీడన్, ఫిన్లాండ్, నార్వేలోని కొన్ని ప్రాంతాలు తీవ్రమైన చలిగాలులను ఎదుర్కొంటున్నాయి. బుధవారం నుంచి డెన్మార్క్‌లోని ఆర్హస్ సమీపంలోని మోటర్‌వేపై వాహనాలు నిలిచిపోయాయి. నివేదికల ప్రకారం స్వీడన్‌లో 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ యేడు శీతాకాలం చలి తీవ్రత నమోదైంది. స్వీడన్‌లో కురుస్తున్న మంచు కారణంగా సుమారుగా 1000 వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. దాదాపు 24 గంటలకు పైగా కురుస్తున్న మంచు ధాటికి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. అనంతరం వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రోజు నుంచి ఉష్ణోగ్రత -43.6C. గురువారం ఉదయం వరకు వాహనాల్లో ఇరుక్కుపోయిన వారందరినీ ఖాళీ చేయించారు సహాయక బృందాలు. లారీలో ఉన్న వారు మాత్రమే వాహనాల్లో ఉండిపోయారు.
బుధవారం సాయంత్రం మంచు తొలగింపు యంత్రాలు కూడా ఘటనా స్థలానికి వచ్చాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది రాత్రంతా శ్రమించారు. రోడ్డుపై వందలాది మంది కార్లలో ఇరుక్కుపోయారు. అధిక రక్తపోటు, మధుమేహంతో సహా వివిధ పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు కూడా ఉన్నారు. 19 గంటల తర్వాత రక్షించబడిన పిల్లలు కూడా ఉన్నారు.
నివేదికల ప్రకారం, రెస్క్యూ టీమ్ వాహనాల్లో చిక్కుకున్న వ్యక్తులకు నీరు, ఆహారాన్ని పంపిణీ చేసింది రెస్క్యూ టీం. రోడ్డుపై మంచు కమ్ముకోవడంతో పలు వాహనాలు ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రెస్క్యూ వర్కర్లు మంచును తొలగిస్తున్నప్పటికీ, భారీ మంచు కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కూడా కష్టతరమైంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..