AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అత్తారింటి నుంచి అయోధ్యకు చేరుకున్న సారె.. 3 వేల రకాల వస్తువులతో అల్లుడిపై భక్తిని చాటుకున్న నేపాలీ వాసులు

నేపాల్‌లోని రామయ్య "అత్తమామల ఇల్లు" జనక్‌పూర్ ధామ్ నుండి మూడు వేల మందికి పైగా ప్రజలు తమ అల్లుడైన శ్రీ రాముని కోసం అనేక బహుమతులు తీసుకుని అయోధ్యకు చేరుకున్నారు. జనకపురి వాసులకు అయోధ్య వాసులు ఘనస్వాగతం ఇచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ బహుమతులను స్వీకరించారు. ఈ సందర్భంగా చంపత్ రాయ్ రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. నేపాల్ , భారతదేశం ఆత్మ సంబంధం కలిగి ఉన్నాయి అని అన్నారు.

Ayodhya: అత్తారింటి నుంచి అయోధ్యకు చేరుకున్న సారె.. 3 వేల రకాల వస్తువులతో అల్లుడిపై భక్తిని చాటుకున్న నేపాలీ వాసులు
Nepal To Ayodhya Gifts
Surya Kala
|

Updated on: Jan 07, 2024 | 8:29 AM

Share

అయోధ్యలో జరగనున్న రామయ్య ఆలయ ప్రారంభ మహోత్సవానికి యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కోట్లాది మంది హిందువులు జనవరి 22 వ తేదీన జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధవుతున్నార్. ఈ శుభ కార్యంలో మేము సైతం అని అంటున్నాయి. నేపాల్, శ్రీలంక, యుఎఇతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు. 22 జనవరి 2024న అయోధ్య ధామ్‌లో నిర్మించిన రామాలయం వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలను జరుపుకోనున్న నేపధ్యంలో రామ్ లల్లాకు అనేక మంది భక్తులు బహుమతులను సమర్పిస్తున్నారు. తాజాగా శ్రీరాముడి అత్తవారింటి నుంచి కూడా భారీ బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి.

నేపాల్‌లోని రామయ్య “అత్తమామల ఇల్లు” జనక్‌పూర్ ధామ్ నుండి మూడు వేల మందికి పైగా ప్రజలు తమ అల్లుడైన శ్రీ రాముని కోసం అనేక బహుమతులు తీసుకుని అయోధ్యకు చేరుకున్నారు. జనకపురి వాసులకు అయోధ్య వాసులు ఘనస్వాగతం ఇచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ బహుమతులను స్వీకరించారు. ఈ సందర్భంగా చంపత్ రాయ్ రెండు దేశాల మధ్య సంబంధాలను కొనియాడారు. నేపాల్ , భారతదేశం ఆత్మ సంబంధం కలిగి ఉన్నాయి అని అన్నారు.

నేపాల్ నుండి ప్రారంభమైన జనక్‌పూర్ ధామ్ రామజానకి దేవాలయం భర్ సనేష్ యాత్ర జనవరి 6 వ తేదీ రాత్రి సమయంలో రామయ్య జన్మ భూమి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని కరసేవకపురం చేరుకుంది. సుమారు 36 వాహనాల్లో 500 మందికి పైగా భక్తులు తమతో పాటు పండ్లు, మిఠాయిలు, బంగారం, వెండి సహా మూడు వేలకు పైగా కానుకలను తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కరసేవకపురం చేరుకున్న తర్వాత ఇద్దరు భక్తులు మాట్లాడుతూ, “మా అల్లుడి జన్మస్థలం పునర్నిర్మించబడడం మా అదృష్టం.. ఇన్ని ఏళ్లకు మళ్లీ రాముడు సింహాసనంపై కుర్చోనున్నాడు అని చెప్పారు. నేపాల్‌లోని జనక్‌పూర్‌ నుంచి వచ్చిన మహిళలు మాట్లాడుతూ.. నిన్నటి వరకు మా కూతురు టెంట్‌లో ఉండేది. ఇప్పుడు ఆమె తన ఇంటికి వస్తోంది. అది మా కూతురి తన ఇంట్లో అడుగు పెడుతున్న వేడుక.. కనుక మా దగ్గర ఉన్నదంతా తమ కూతురి ఇంటిని నింపాలనుకుంటున్నామని చేబుతున్నారు.

కూతురికి పుట్టింటి వారు పెట్టె సారేలో ఎ విధమైన వస్తువులు ఉంటాయో అదే విధంగా ఇప్పుడు నేపాల్ నుంచి భక్తులు అన్ని రకాల వస్తువులను తీసుకుని వచ్చారు. అన్ని ఆహార పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ తో పాటు వెండి పాత్రలు, బంగారు ఆభరణాల సహా మూడు వేల రకాల వస్తువులను అల్లుడి కోసం తీసుకుని వచ్చారు. ఇందులో స్వయంవరం కోసం రామయ్య విరిచిన విల్లుకి సింబాలిక్ రూపాన్ని వెండితో చేయించి తీసుకొచ్చామని తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..