AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగవారి తల వంటి పర్వతం.. దానిని జయించేందుకు ఎగబడుతున్న యువతులు.. వీడియో వైరల్..!

మోకా పర్వతాల మధ్యలో ఉన్న ఈ పర్వతం చుట్టూ పచ్చని కొండలు ఉన్నాయి. ఇందులో వన్యప్రాణులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి, సాహసానికి ప్రసిద్ధి చెందిన ఈ పర్వతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. మారిషస్ టూరిజం శాఖ విడుదల చేసిన ఓ అందమైన వీడియోలో ఇద్దరు యువతులు పర్వత శిఖరాన్ని అధిరోహిస్తూ కనిపించారు. పర్వతం ఎక్కడం చాలా కష్టం. నిటారుగా ఉన్న మార్గాల ద్వారా పర్వతాన్ని అధిరోహించడానికి..

మగవారి తల వంటి పర్వతం.. దానిని జయించేందుకు ఎగబడుతున్న యువతులు.. వీడియో వైరల్..!
mountain like the head of a human being
Jyothi Gadda
|

Updated on: Jan 06, 2024 | 7:17 PM

Share

భూమిపై అద్భుతాలకు అంతం లేదు. ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు ఉన్నాయని సోషల్ మీడియా రాకతో రుజువైంది. రోజురోజుకూ సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ప్రపంచంలోని అనేక వింతలు, విచిత్ర దృశ్యాలు కనిపిస్తున్నాయి.. మారిషస్ ద్వీపం నుండి మారిషస్ టూరిజం డిపార్ట్‌మెంట్ అలాంటి వీడియో ఒకటి విడుదల చేసింది. Mauritius Tourism Department వీడియోని ష ఏర్‌ చేశారు. ‘దాదాపు ప్రతి దక్షిణ, మధ్య మరియు ఉత్తర మార్గం నుండి కనిపిస్తుంది, పీటర్ బోథ్ మారిషస్‌లోని అత్యంత ప్రసిద్ధ పర్వతాలలో ఒకటి.’ దాదాపు ఒక అందమైన లోయ మధ్యలో ఒక భారీ పర్వతం. పర్వతం పైభాగం నేరుగా దూరం వైపు చూస్తున్న మానవ మూర్తిలా కనిపిస్తుంది.

ఇద్దరు యువతులు ఎత్తైన పర్వతాన్ని అధిరోహిస్తున్న వీడియో అది. పర్వతం మొదటి దృశ్యం మనల్ని ఆకర్షిస్తుంది. టర్ బోత్ (820మీ ఎత్తు) మారిషస్‌లో రెండవ ఎత్తైన పర్వతం. ఎత్తైన పర్వతం బ్లాక్ రివర్ పీక్ (828 మీటర్ల ఎత్తు). డచ్ ఈస్ట్ ఇండీస్ మొదటి గవర్నర్ జనరల్ పీటర్ బోత్ పేరు మీద పీటర్ బోథ్ పేరు పెట్టారు. మోకా పర్వతాల మధ్యలో ఉన్న ఈ పర్వతం చుట్టూ పచ్చని కొండలు ఉన్నాయి. ఇందులో వన్యప్రాణులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి, సాహసానికి ప్రసిద్ధి చెందిన ఈ పర్వతం పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటి. మారిషస్ టూరిజం శాఖ విడుదల చేసిన ఓ అందమైన వీడియోలో ఇద్దరు యువతులు పర్వత శిఖరాన్ని అధిరోహిస్తూ కనిపించారు. పర్వతం ఎక్కడం చాలా కష్టం. నిటారుగా ఉన్న మార్గాల ద్వారా పర్వతాన్ని అధిరోహించడానికి స్టామినాతో పాటు ట్రెక్కింగ్ సాధనాలు అవసరం. పర్వత శిఖరాన్ని జయించిన తర్వాత, మీరు మారిషస్ అందమైన ద్వీపాన్ని చూడవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..