AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తల తిప్పకుండా మందేస్తున్న కుక్కపిల్ల..! చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్న యువకులు.. కట్‌ చేస్తే..

ఆ సమయంలో కుక్కపిల్లకి మద్యం ఇచ్చిన యువకుల గుంపు నవ్వుతూ, సంబరాలు చేసుకుంటుంది. అంతే కాదు కుక్కపిల్ల సంతోషంగా మద్యం సేవిస్తోందని కూడా వారు ప్రశంసించారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఒక యువకుడు తన సెల్‌ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Watch Video: తల తిప్పకుండా మందేస్తున్న కుక్కపిల్ల..! చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్న యువకులు.. కట్‌ చేస్తే..
Puppy Whiskey
Jyothi Gadda
|

Updated on: Jan 06, 2024 | 5:57 PM

Share

మద్యం మత్తులో తాగుబోతులు చేసే పనులు ఎదుటివారిని ఇబ్బంది పెట్టేవిగానే ఉంటాయి. చాలా సందర్భాల్లో మందుబాబుల వింత చేష్టలతో చిరాకు తెప్పిస్తుంటారు. అంతేకాదు.. కొందరు అరాచకంగా, దారుణంగా ప్రవర్తిస్తుంటారు. చాలా వరకు ప్రతి నిత్యం వినిపించే నేర వార్తల్లో ఎక్కువగా మద్యం మత్తులో ఉండగా జరిగినవే అని పోలీసులు చెబుతుంటారు. ఇకపోతే, తాగుబోతులు పీకల దాకా మందేసి ఎదుటి వ్యక్తులను, లేదంటే మూగ జీవాలను హింసించే సంఘటనలు కూడా మనం వార్తల్లో తరచూగా చూస్తుంటాం.. అలాంటిదే ఇక్కడ కొందరు యువకులు ఒక నోరులేని కుక్కపిల్లతో ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. వైరల్‌ వీడియోలో కొందరు యువకులు కుక్క పిల్లలకు మద్యం తాగిస్తున్నారు..ఈ ఘటన రాజస్థాన్‌ రాష్ట్రంలో జరిగినట్టుగా తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో కొంతమంది ఒక కుక్కకు ఆల్కహాల్ పట్టిస్తుండటం ఇందులో కనిపించింది. ఆ సమయంలో కుక్కపిల్లకి మద్యం ఇచ్చిన యువకుల గుంపు నవ్వుతూ, సంబరాలు చేసుకుంటుంది. అంతే కాదు కుక్కపిల్ల సంతోషంగా మద్యం సేవిస్తోందని కూడా వారు ప్రశంసించారు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఒక యువకుడు తన సెల్‌ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సవాయ్ మాధోపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. వీడియో వైరల్ అయిన తర్వాత, ప్లాట్‌ఫారమ్ Xలోని రాజస్థాన్ పోలీస్ హెల్ప్‌డెస్క్ స్థానిక పోలీసులను అప్రమత్తం చేసింది. వీడియో ఆధారంగా జరిగిన సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలంటూ ఆదేశించింది. మరోవైపు వైరల్‌గా మారిన వీడియోపై స్పందించిన స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
ప్రియుడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసిన మహిళ!
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?