AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ జిందాబాద్.. రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో

రాప్తాడు బాలికపై రంపంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు పోలీసుల కాల్పులపై అయ్యవారిపల్లి, రాప్తాడు గ్రామాల్లో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పోలీస్ జిందాబాద్.. రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో
Rapthadu Incident
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2026 | 8:49 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రాప్తాడు దుర్ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలికపై రంపంతో దాడిచేసిన హేమంత్‌‌ పై ఆత్మకూరు అటవీప్రాంతంలో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపైకి తిరగబడి.. కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించడంతో.. ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో హేమంత్‌కి తీవ్ర గాయాలు కాగా.. అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. అయితే.. ఇప్పటికే.. పదో తరగతి అమ్మాయిపై రాక్షసంగా దాడిచేసిన నిందితుడిని.. కాల్చి చంపాలంటూ ఇప్పటికే జనం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే.. పోలీసులు కాల్పులు జరపడంతో.. ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. బాధిత విద్యార్థిని స్వగ్రామం అయ్యవారిపల్లిలో హర్షం వ్యక్తంచేస్తూ గ్రామస్థులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. రాప్తాడులోనూ ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.

వీడియో చూడండి..

ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు..

అనంతపురం జిల్లా రాప్తాడు అమానుష దాడిలో తీవ్రంగా గాయపడిన బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే.. బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు వెళ్లిన మంత్రి లోకేష్‌.. బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. బాలికకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులతో చర్చించారు. దీంతో.. బాలికకు అవసరమైన సర్జరీలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి లోకేష్‌కు వైద్యులు తెలిపారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఇదిలాఉంటే.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా ఇవాళ బెంగళూరు ఆస్పత్రిలో బాలికను పరామర్శించనున్నారు.

Follow Us