Viral Video: అర్ధరాత్రి తప్పతాగిన యువతి.. ఒంటిపై సరైన బట్టలు కూడా లేని స్థితిలో.. ఉబెర్‌ డ్రైవర్‌ చేసిన పనికి నెటిజన్ల రియాక్షన్‌..

ఈ వీడియో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. ఇలాంటి అనుభవాలను చాలా మంది రాశారు. అలాంటి సందర్భాల్లో ఇతరులు ఎదుర్కొన్న ఆపదల గురించి కూడా కొందరు రాశారు. బ్రెజిల్‌లో ఉబెర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న మహిళను వీధిలో వదిలేశాడు. మరో వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ యువతిని కాపాడేందుకు ప్రయత్నించిన భారతీయుడికి వందనాలు అంటున్నారు మరికొందరు నెటిజన్లు.

Viral Video: అర్ధరాత్రి తప్పతాగిన యువతి.. ఒంటిపై సరైన బట్టలు కూడా లేని స్థితిలో.. ఉబెర్‌ డ్రైవర్‌ చేసిన పనికి నెటిజన్ల రియాక్షన్‌..
Uber Driver
Follow us

|

Updated on: Jan 06, 2024 | 5:24 PM

రాత్రిపూట రోడ్డుపై ఒంటరిగా వెళ్లాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.. ఎందుకంటే..ఒంటిరిగా వెళితే.. ఎవరి చేతిలో దాడికి గురి కావాల్సి వస్తుందోనని భయంతో బతుకుతున్న రోజులివి. ఇలాంటి దాడులు, మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అనేక వార్తలు ప్రతిరోజూ వింటునే ఉన్నాం.. ఈ నేపథ్యంలోనే మనలో చాలా మందికి అలాంటి భయాన్ని కలిగించడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి రోజుల్లో ఇక రాత్రిపూట ఒంటరిగా మద్యం మత్తులో ఉన్న మహిళ అయితే ఎలా ఉంటుంది? అలాంటి మహిళను ఆ దేవుడో రక్షించాలి.. అయితే, అందరూ ఒకేలా ఉండరని, మనుషుల్లో మానవత్వం, మంచితనం ఉన్నావాళ్లు కూడా ఉన్నారని నిరూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియోను చాలా మంది వీక్షించారు. ఒక్కరోజులో 64 లక్షల మంది ఈ వీడియోను చూశారు.. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

ఆ వీడియోలో ఓ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఇది. సీసీటీవీ ముందు వృద్ధుడిలా కనిపిస్తున్న వ్యక్తి, అతని వెనుక చేతులు ముడుచుకుని చల్లగా నిలబడి ఉన్న యువతి కనిపిస్తున్నారు. ఉబెర్ డ్రైవర్ సీసీటీవీ వైపు చూస్తూ.. ఆ యువతి సరైన దుస్తులు ధరించలేదని, పైగా తాగి ఉందని చెబుతున్నాడు. ఆ తరువాత మెయిల్‌బాక్స్‌లో చూస్తే మీకు కీ దొరుకుతుందని ఇంటి లోపల నుండి ఒక మహిళ వాయిస్ వినబడింది. ఆ తర్వాత ఇద్దరూ ఇంట్లోకి వెళ్లేందుకు సిద్ధపడగా వీడియో ముగుస్తుంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పబ్లిటీ షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pubity (@pubity)

ఈ వీడియో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆకర్షించింది. ఇలాంటి అనుభవాలను చాలా మంది రాశారు. అలాంటి సందర్భాల్లో ఇతరులు ఎదుర్కొన్న ఆపదల గురించి కూడా కొందరు రాశారు. బ్రెజిల్‌లో ఉబెర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న మహిళను వీధిలో వదిలేశాడు. మరో వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ యువతిని కాపాడేందుకు ప్రయత్నించిన భారతీయుడికి వందనాలు అని ఓ వీక్షకుడు రాశారు. అయితే ఆ వీడియో ఎక్కడిది, ఆ వీడియోలో ఉబెర్ డ్రైవర్ ఎవరనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. కానీ, వీడియోపై కొందరు ఆ డ్రైవర్‌ సదరు యువతికి తండ్రిలాంటివాడని పేర్కొన్నారు. అయితే ఆడపిల్లలు ముఖ్యంగా రాత్రిపూట మద్యం సేవించడం సురక్షితం కాదని కొందరు సలహా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ