Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Rama Mandir: ఇంటింటికీ అయోధ్య రాముడి పవిత్ర అక్షింతలు.. ఘన స్వాగతం పలుకుతున్న భక్తులు…

అక్షింతల కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిస్తున్నారు.. హనుమాన్ భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇంటికి అక్షింతలు తీసుకరావడంతో మహిళలు.. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు.. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు... సాయంత్రం పూట... ప్రత్యేక శోభయాత్రలు నిర్వహిస్తున్నారు....

Ayodhya Rama Mandir: ఇంటింటికీ అయోధ్య రాముడి పవిత్ర అక్షింతలు.. ఘన స్వాగతం పలుకుతున్న భక్తులు...
Distribution of axes of Sri Rama
Follow us
G Sampath Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 06, 2024 | 4:17 PM

కరీంనగర్, జనవరి 06; ఇప్పుడు, ఏ వీధిలో చూసినా రామనామమే మారుమోగుతుంది.. ఈ నెల 22న అయోధ్యలో… రాముడి గ్రహాన్ని ప్రతిష్టిస్తున్న నేపథ్యంలో… ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి హిందూ సంస్థలు… ఆయోధ్య నుంచీ తీసుకొచ్చిన.. అక్షింతలను.. ఇంటి… ఇంటికి తీసుకెళ్లి భక్తులకు ఇస్తున్నారు. డప్పు, చప్పుళ్ల మధ్య ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అక్షింతలతో పాటు… అయోధ్య రామాలయ ఫోటో కూడా భక్తులకు అందజేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో… అయోధ్య రాముడి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.. ఈ నెల 22న అయోధ్య రామాలయం ప్రారంభమవుతున్న సందర్భంగా… పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయోధ్య నుంచీ తీసుకొచ్చిన అక్షింతలను… ఇంటి…. ఇంటికి వెళ్లి ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ప్రతి దేవాలయం నుంచీ, ఈ ఊరేగేంపు మొదలవుతుంది… అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలను ఇస్తున్నారు.. పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తున్నారు.. పార్టీలకు అతీతంగా . పలువురు నేతలు కూడా పాల్గొంటున్నారు.. ముఖ్యంగా మహిళలు.. పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.. ఈ నెల 15 వరకు.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. 22వ తేదీన… ఆలయాల్లో… అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.. ప్రతి ఒక్కరు.. ఇంట్లో వంట చేసుకోకుండా.. ఆలయం లో తినేందుకు ప్లాన్ చేస్తున్నారు… అదే విధంగా ప్రతి ఇంటి గోడకు జైశ్రీరామ్ అనే నినాధాల వాల్ రాయిటింగ్ చేస్తున్నారు.. ప్రతి ఇంటిపైన కాషాయ జెండాను ఏర్పాటు చేస్తున్నారు… అంతేకాదు.. రామాలయాల్లో ఉదయం, సాయంత్రం… భజన కార్యక్రామాలు నిర్వహిస్తున్నారు.

అక్షింతల కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిస్తున్నారు.. హనుమాన్ భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇంటికి అక్షింతలు తీసుకరావడంతో మహిళలు.. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు.. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు… సాయంత్రం పూట… ప్రత్యేక శోభయాత్రలు నిర్వహిస్తున్నారు….

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు చెబుతున్నారు. అయోధ్య నుంచీ తీసుకొచ్చిన అక్షింతలను ప్రతి ఇంటికి వెళ్లి ఇస్తున్నామని అంటున్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని అంటున్నారు.  500 యేళ్ల తరువాత.. అయోధ్యలో రామాలయం నిర్మించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు ప్రజలు, రామ భక్తులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..