Saryu River: పవిత్రమైన సరయు నది.. శివుడి శాపానికి ఎందుకు గురైందో తెలుసా..

రామాయణంలో సూచించినట్లుగా సరయు నది పవిత్రమైనవి అయినప్పటికీ  శివుడు చేత శపించబడింది.  అందువల్ల ఈ నది పవిత్రమైనా శాపగ్రస్తమైనది. సరయు నది ప్రస్తావన ఋగ్వేదం, అథర్వవేదాల్లో కూడా ఉంది. పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన శ్రీ రాముడు తన అవతారం చాలించే సమయంలో సరయూ నదిలో జల సమాధి అయ్యి తన జీవితాన్ని ముగించాడు. దీని కారణంగా శివయ్యకు సరయూ నదిపై చాలా కోపం వచ్చింది.

Saryu River: పవిత్రమైన సరయు నది.. శివుడి శాపానికి ఎందుకు గురైందో తెలుసా..
Sarayu River
Follow us
Surya Kala

|

Updated on: Jan 06, 2024 | 1:05 PM

సరయు నది, ఉత్తరాఖండ్‌లో ఉద్భవించి ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహించే నది. ఇది శారదా నది ఉపనది.వేదాలలో, రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది. ఇది గంగానదికి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు.ఈ నదిని గోగ్రానది అని కూడా అంటాు.ఈ నది బీహార్ లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

హిందూ ధర్మంలో నదులను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. పూజిస్తారు. గంగా నదికి ఉపనది అయిన సరయు నది గురించి అందరికీ తెలుసు. ఉత్తరాఖండ్‌లో జన్మించిన సరయు నది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యని ఆనుకుని ప్రవహిస్తుంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. అయోధ్య భూమిని సారవంతం చేయడంతో పాటు శ్రీ రాముని జననాలు, అవతారం సమాప్తి వరకూ సజీవ సాక్షిగా నిలిచింది. అయోధ్య నగరం సరయూ నది ఆశీర్వాదం పొందింది. ఇప్పుడు ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉద్భవించింది. పవిత్ర భూమిగా హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రంగా కీర్తించబడుతుంది. సరయు నది హిమాలయాలలలో పుట్టి ఉత్తరప్రదేశ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. అయితే ఈ నది శాపగ్రస్తమైందని మీకు తెలుసా..! ఈ నదిలో స్నానం చేసిన వారి పాపాలు నశిస్తాయి.. అయితే ఆ నది స్నానం వలన పుణ్యం లభించదు. దీని వెనుక పురాణాల కథ ఏమిటో తెలుసుకుందాం..

సరయూ నది ఎందుకు శాపగ్రస్తమైందో తెలుసా?

రామాయణంలో సూచించినట్లుగా సరయు నది పవిత్రమైనవి అయినప్పటికీ  శివుడు చేత శపించబడింది.  అందువల్ల ఈ నది పవిత్రమైనా శాపగ్రస్తమైనది. సరయు నది ప్రస్తావన ఋగ్వేదం, అథర్వవేదాల్లో కూడా ఉంది. పురాణాల ప్రకారం విష్ణువు అవతారమైన శ్రీ రాముడు తన అవతారం చాలించే సమయంలో సరయూ నదిలో జల సమాధి అయ్యి తన జీవితాన్ని ముగించాడు. దీని కారణంగా శివయ్యకు సరయూ నదిపై చాలా కోపం వచ్చింది. అప్పుడు సరయూ నది నీటిని ఏ పవిత్ర కార్యాలకు, ఆలయంలో నైవేద్యానికి ఉపయోగించవద్దని, నీటిని పూజలో కూడా ఉపయోగించవద్దని శపించాడు.

ఇవి కూడా చదవండి

తనకు శివయ్య ఇచ్చిన శాపం విన్న వెంటనే సరయు మాత శివయ్య పాదాలపై పడి.. “ప్రభూ, ఇందులో నా తప్పు ఏమిటి? రాముడి అవతార సమాప్తి ఏ విధంగా జరగాలనేది ఎప్పుడో నిర్ణయించబడింది. ఇందులో నేను చేసిన నేరం ఏమిటి అని అంటూ శివుడుని అభ్యర్ధించింది. సరయు దేవి చేసిన అభ్యర్థనను విన్న శివయ్య తను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని చెప్పాడు. శాప ఉపశమనం చెప్పాడు. సరయు నది నీటిలో స్నానం చేయడం వలన ప్రజల పాపాలు కడిగివేయబడతాయి. అయితే నది నీరు పూజలకు, దేవాలయాలలో  అర్చనకు ఉపయోగించినా ప్రతి ఫలం లభించదు. అదే సమయంలో పాపం కూడా కాదు.. అని చెప్పాడు శివుడు. అందుకనే అప్పటి నుంచి సరయు నదిని ప్రార్ధన, పూజ సమయంలో ఉపయోగించరు.

యజ్ఞ , యాగాదులకు

ప్రస్తుతం కూడా సరయూ నది నీటిని వినియోగించరు. ఎక్కడ ఎ సందర్భంలో యజ్ఞ, యాగాలు చేసినా సప్త నదుల నదుల నీటిని సేకరిస్తారు. కానీ ఆ సప్త నదుల్లో సరయు నది నీటిని చేర్చలేదు. శాపగ్రస్తమైన సరయూ నదికి కుంభ మేళ, అర్ధ కుంభ మేళ వంటి పవిత్ర కార్యక్రమాలు నిర్వహించరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు