- Telugu News Photo Gallery Spiritual photos Ram Mandir Inauguration: AI surveillance likely to be introduced to protect temple
Ayodhya Ram Mandir: అయోధ్యకు రానున్న కాలంలో పెరగనున్న భక్తుల రద్దీ.. భద్రతా కోసం AI టెక్నాలజీ
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మందిరం కుల్చివేతపై కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు మెయిల్స్ అందుతున్నాయి. మరోవైపు రామ మందిర ప్రారంభోత్సవానికి భారీ సంఖ్యలో ప్రముఖులు, భక్తులు హాజరు కానున్నారు. ఈ నేపధ్యంలో రామ మందిరం భద్రతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించనున్నారని తెలుస్తోంది. AIకి సంబంధించిన అధునాతన పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. వీటి ద్వారా అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రదేశాలను సందర్శించే వ్యక్తులను నిశితంగా పరిశీలించవచ్చు. IB, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇతర భద్రతల సమన్వయంతో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు చెబుతున్నారు.
Updated on: Jan 06, 2024 | 10:33 AM

జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఫూల్ ప్రూఫ్ సెక్యూరిటీ షీల్డ్‌ను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రదేశాలను సందర్శించే వ్యక్తులను నిశితంగా పరిశీలించవచ్చు. ఈ మేరకు IB,రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇతర భద్రతా సంస్థల సమన్వయంతో భద్రతకు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ గా అయోధ్యలో ప్రారంభించనున్నామని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

పోలీసు డేటాబేస్‌లో నేరస్తుల సమాచారం నిక్షిప్తం చేయనున్నారు. రామాలయం ప్రారంభోత్సవం తర్వాత రానున్న రోజుల్లో అయోధ్యకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరగనుందని అంచనా వేస్తున్నారు. దీంతో భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి AI ఉపయోగపడుతుందని.. అందుకనే ఈ దిశలో అడుగులు వేస్తున్నామని.. చెప్పారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అయోధ్యలోని ప్రాంతాన్నిటిని ఆలయంలో ప్రతి భాగాన్ని పర్యవేక్షించవచ్చు. పోలీసు డేటాబేస్‌లో ఉన్న నేరస్థులను కూడా పర్యవేక్షించవచ్చు.

అత్యాధునిక భద్రతా పరికరాలు కొనుగోలు: అయోధ్యకు వచ్చే వారందరి కదలికలపై AI నిశితంగా నిఘా ఉంచుతుంది. ఒక ప్రదేశంలో తరచుగా తిరిగే వ్యక్తిని గుర్తించే వ్యవస్థ కూడా ఉండాలని చూస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంది.

అయోధ్యలో అత్యాధునిక భద్రతా పరికరాల కోసం ప్రభుత్వం రూ.90 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో స్కానర్లు, డ్రోన్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. జనవరి 22న అయోధ్యలో భద్రత కోసం అదనపు ఐపీఎస్ అధికారులను కూడా మోహరిస్తారు.




