Ayyappa Temple: అయ్యప్ప భక్తులకు కీలక సూచన.. అరవణ ప్రసాదం కొరత.. ఇక నుంచి రెండు డబ్బాలు మాత్రమే..
శబరిమల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో లభ్యమయ్యే ఈ ప్రసాదం వెరీ వెరీ స్పెషల్. అయ్యప్ప స్వామి దర్శనం నుంచి తిరిగి వచ్చే భక్తులు తెచ్చే అయ్యప్ప అరవణ పాయసం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూసే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు షాకింగ్ న్యూస్ చెప్పింది. అరవణ ప్రసాదంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది.
కేరళ శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. లక్షలాది మంది అయ్యప్పస్వాముల నినాదాలతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. అయ్యప్ప శరణు ఘోసతో శబరిమల సన్నిధానం మార్మోగుతోంది. గంటల తరబడి క్యూ లో నిలుచుని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తమ ముడుపులు చెల్లించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. అయితే శబరిమల అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. కేరళ అయ్యప్ప స్వామి ఆలయంలో లభ్యమయ్యే ఈ ప్రసాదం వెరీ వెరీ స్పెషల్. అయ్యప్ప స్వామి దర్శనం నుంచి తిరిగి వచ్చే భక్తులు తెచ్చే అయ్యప్ప అరవణ పాయసం కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూసే వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు షాకింగ్ న్యూస్ చెప్పింది.
అరవణ ప్రసాదంపై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పరిమితి విధించింది. ప్రస్తుతం మండల దీక్ష భక్తుల రద్దీ కొనసాగుతోందని.. మరోవైపు మకర జ్యోతి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా భారీ సంఖ్యలో ఉండనున్నారని అంచనా వేసి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అరవణ ప్రసాదం డబ్బాల కొరత నేపథ్యంలో ఒకొక్క భక్తుడికి ఇక నుంచి రెండు డబ్బాల ప్రసాదం మాత్రమే ఇవ్వనున్నామని వెల్లడించింది.
అయ్యప్ప స్వాములకు అపురూప దృశ్యం మకర జ్యోతి దర్శన సమయంలో ఏర్పడే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంతో భక్తులు తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రసాదం కౌటర్లు కూడా మూసి వేయడంతో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే అరవణ ప్రసాదం డబ్బాల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త కంపెనీలకు ప్రసాదం తయారీ కాంట్రాక్ట్ ని ఇచ్చారు. గత ఏడాది డిసెంబరు 26న రెండు కొత్త కంపెనీలకు అరవణ ప్రసాదం తయారీ చేయడానికి కాంట్రాక్టును ఇచ్చారు. అయినప్పటికీ భక్తుల రద్దీకి తగినట్లుగా ప్రసాదం డబ్బాలను అందిచలేకపోయాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..