AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క.. ప్లాస్టిక్‌ వినియోగంపై కీలక ఆదేశాలు

తెలంగాణ కుంభమేళా...మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క, సారక్కల జాతర నిర్వహిస్తారు.

Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క.. ప్లాస్టిక్‌ వినియోగంపై కీలక ఆదేశాలు
Minister Seethakka
Follow us
Basha Shek

|

Updated on: Jan 07, 2024 | 7:04 AM

తెలంగాణ కుంభమేళా…మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క, సారక్కల జాతర నిర్వహిస్తారు. ఇది ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతర కోసం అభివృద్ధి పనులను వేగవంతం చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. మేడారం సమ్మక్క -సారలమ్మ జాతర అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. మేడారంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జంపన్నవాగు పై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ పరిసరాలను సీతక్క పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. సమక్క, సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు…అంతా కలిసి ఒక టీమ్‌గా పని చేసి మేడారం జాతరను సక్సెస్‌ చేయాలన్నారు సీతక్క.

గిరిజన సంప్రదాయాలకు విఘాతం కలగకుండా చూడాలని, గిరిజన పూజారులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయిలో మరోసారి సమీక్ష జరపనున్నారు సీతక్క. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేలా చూడాలని అధికారులకు సూచించారు. మేడారం జాతరకు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సీతక్క..

ఇబ్బందులు లేకుండా చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..