Telangana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. 17 వరకు ఆన్‌లైన్‌లో నమోదు! ఆ తర్వాతే

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ప్రజా పాలన కార్యక్రమం ముగింపు సమయం నాటికి మొత్తం 1,25,84,383 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రజా పాలనలో చివరి రోజు వచ్చిన అప్లికేషన్లు 16 లక్షల 90 వేల రెండు వందల 78. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17 వరకు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలో ప్రతి రోజూ డేటా ఎంట్రీలు చేసే విధంగా చూడాలని ఆయా జిల్లా కలెక్టర్లు..

Telangana: ముగిసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. 17 వరకు ఆన్‌లైన్‌లో నమోదు! ఆ తర్వాతే
Praja Palana Programme
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 07, 2024 | 7:38 AM

హైదరాబాద్‌, జనవరి 7 : ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ప్రజా పాలన కార్యక్రమం ముగింపు సమయం నాటికి మొత్తం 1,25,84,383 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రజా పాలనలో చివరి రోజు వచ్చిన అప్లికేషన్లు 16 లక్షల 90 వేల రెండు వందల 78. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 17 వరకు అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలో ప్రతి రోజూ డేటా ఎంట్రీలు చేసే విధంగా చూడాలని ఆయా జిల్లా కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గత నెల 28 నుంచి పది రోజుల పాటు సాగిన ఈ ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.

తెలంగాణ వ్యాప్తంగా 12,171 గ్రామ పంచాయితీలు, 3512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలనా అభయ హస్తం దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల్లో గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలకు వేర్వేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేకుండా, ఆరు గ్యారంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, చేయూత పథకం, కొత్త రేషన్ కార్డుల కోసం వినతి పత్రాలు స్వీకరించారు.

ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ దిశగా చర్యలు చేపట్టింది. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ముగియగానే వెంటనే డేటా ఎంట్రీ చేటపట్టాలని ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగానే డీటీపీ ఆపరేటర్లను నియమించింది. ఇప్పటికే వీరికి ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేసింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని అదనంగా నియమించాలని కూడా భావిస్తోంది. అప్లికేషన్ల డేటా ఎంట్రీ ప్రక్రియ జనవరి 17వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తికాగానే ఆ తర్వాత అర్హుల గుర్తింపు చేపట్టనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.