Trending News: ఈ పార్క్‌కు వెళితే మీరు కోటీశ్వరులవుతారు..! ఎక్కడా, ఎలాగో తెలుసా..?

ఇది వజ్రాల గని మాత్రమే కాదు.. అనేక ఇతర రత్నాలు కూడా లభిస్తుంటాయి.. రికార్డుల ప్రకారం.. ఇక్కడ దాదాపు 40 రకాల ఖనిజాలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం అదృష్టవంతులు తమ అదృష్టాన్ని బట్టి అమెథిస్ట్, గోమేదికం, కాల్సైట్, పెరిడాట్ మొదలైన ఖరీదైన రత్నాలను కూడా సొంతం చేసుకుంటారు. ఈ విలువైన డైమండ్ హోర్డ్ 911 ఎకరాల స్టేట్ పార్క్‌లో భాగంగా ఉందంటున్నారు సంబంధిత వర్గాలు.

Trending News: ఈ పార్క్‌కు వెళితే మీరు కోటీశ్వరులవుతారు..! ఎక్కడా, ఎలాగో తెలుసా..?
Visitors Hunt For Diamonds
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 06, 2024 | 6:51 PM

మనం పార్కుకు ఎందుకు వెళ్తాము ? ప్రశాంతంగా గడపడానికి, లేదంటే..ఫ్రెండ్స్‌తో జాలీగా ఉండటానికి. అయితే అమెరికాలో ఓ పార్క్ ఉంది. ప్రజలు ఆ పార్క్‌కి వెళ్లేందుకు మాత్రం వేరే కారణం ఉంది.. ఈ పార్క్‌కి వచ్చే ప్రజలు వజ్రాలు వెతుకుతూ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పార్కుకు వెళతారు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. స్టేట్ ఆఫ్ డైమండ్స్ అని పిలువబడే ఈ పార్క్ యునైటెడ్ స్టేట్స్‌లోని నైరుతి అర్కాన్సాస్‌లో ఉంది. దేశంలో ఎక్కువ వజ్రాలు కలిగిన గని ఇదే. ఇక్కడి ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తరచుగా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. సందర్శకులు పార్క్‌లోకి ప్రవేశించి, కేటాయించిన ఫీజు మేరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వజ్రాల కోసం వేటా సాగిస్తారు.

అవును, ఈ పార్క్ మీ కలలకు స్వాగతం చెబుతుందనే చెప్పాలి. ఆసక్తికరంగా, ఇది వజ్రాల గని మాత్రమే కాదు.. అనేక ఇతర రత్నాలు కూడా లభిస్తుంటాయి.. రికార్డుల ప్రకారం.. ఇక్కడ దాదాపు 40 రకాల ఖనిజాలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే కొంచెం అదృష్టవంతులు తమ అదృష్టాన్ని బట్టి అమెథిస్ట్, గోమేదికం, కాల్సైట్, పెరిడాట్ మొదలైన ఖరీదైన రత్నాలను కూడా సొంతం చేసుకుంటారు. ఈ విలువైన డైమండ్ హోర్డ్ 911 ఎకరాల స్టేట్ పార్క్‌లో భాగంగా ఉందంటున్నారు సంబంధిత వర్గాలు.

ఈ బిలం 1972లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి 35,000 కంటే ఎక్కువ రత్నాలు ఇక్కడ లభించాయి.. ప్రతి సంవత్సరం 100,000 కంటే ఎక్కువ మంది సందర్శకులు తమ అదృష్టాన్ని వెతకడానికి ఈ పార్కును సందర్శిస్తారని అంచనాలు సూచిస్తున్నాయి. ఇక్కడ లభించిన కొన్ని రత్నాలు సంవత్సరాలుగా ప్రజాదరణ పొందడం కూడా గమనించదగ్గ విషయం. ఈ రత్నాలలో కొన్ని 40.23 క్యారెట్ అంకుల్ సామ్ (1924), 34.25 క్యారెట్ స్టార్ ఆఫ్ మర్‌ఫ్రీస్‌బోరో (1964) ఉన్నాయి. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు లభించిన రెండు అతిపెద్ద వజ్రాలు ఇవి. ఈ రెండు కాకుండా, ఈ పార్కులో 15.33 క్యారెట్ స్టార్ ఆఫ్ అర్కాన్సాస్ (1956) కూడా దొరికినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..`