Telangana: రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుడు.. ప్లాట్‌ఫారమ్‌పైనే హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం రెండవ ప్లాట్‌ఫారంపై వేచి చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలుఎక్కేందుకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలీపోయాడు. మృతుడి భార్య నవ్య ఏం జరిగిందో అర్థం కాక స్థానికుల సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందాడని స్పష్టం చేశారు.. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాంబాబు మృతితో తట్టెలపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Telangana: రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుడు.. ప్లాట్‌ఫారమ్‌పైనే హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
Passenger Death At railway station
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 06, 2024 | 6:33 PM

ఓ ప్రయాణికుడు తాను చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరకుండానే అనంతలోకాలకు చేరిపోయాడు.. రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫారం పైనే ఒక్కసారిగా కుప్పకూలి హఠాన్మరణం చెందాడు. ఈ విషాద సంఘటన మహబూబాబాద్ రైల్వేస్టేష్‌లో చోటు చేసుకుంది. జరిగిన సంఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర కలకలం రేపింది. శనివారం 2వ నెంబర్ ఫ్లాట్ ఫారంపై వంగూరి రాంబాబు (30) అనే ప్రయాణికుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తట్టెలపాడుగ్రామానికి చెందిన వంగూరి రాంబాబు (30) తన కుటుంబంతో కలిసి మహబూబాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు బయల్దేరాడు. రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు.. టికెట్ కొనుగోలు చేశాడు.. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు కోసం రెండవ ప్లాట్‌ఫారంపై వేచి చూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలుఎక్కేందుకు ఎదురు చూస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలీపోయాడు. మృతుడి భార్య నవ్య ఏం జరిగిందో అర్థం కాక స్థానికుల సాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందాడని స్పష్టం చేశారు.. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాంబాబు మృతితో తట్టెలపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..