శీతాకాలంలో నిమ్మ రసం తీసుకోవచ్చా?
02 January 2026
TV9 Telugu
TV9 Telugu
తేనెలో కలిపి తాగితే ఆరోగ్యం... పులిహోరలో వాడితే అదిరిపోయే రుచి.. ఇస్తున్న పుల్లని నిమ్మ. ఆరోగ్యానికి రక్షణగా నిలిచే నిమ్మ శీతాకాలంలో తప్పక తీసుకోవాలి
TV9 Telugu
నిజానికి ప్రతి ఇంటి వంటింట్లో అందుబాటులో ఉండే నిమ్మకాయంటే చాలామందికి చిన్న చూపే. కానీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా దీనిలోని విటమిన్ సి వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి వాటిని రాకుండా అడ్డుకుంటుంది
TV9 Telugu
నిమ్మలోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు కణాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నరాల ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా వీటి నుంచి లభిస్తుంది
TV9 Telugu
నిమ్మ మాత్రమే కాదు సిట్రస్ జాతికి చెందిన పండ్లు బత్తాయి, నారింజ, పంపరపనస, గజనిమ్మ, కమలాలు అన్నింటిలోనూ పోషకాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
శరీరం ఇనుముని గ్రహించుకోవడానికి ఇవి సాయపడతాయి. నిమ్మకాయలతో పచ్చళ్లు పెట్టుకుంటారు. ఇంకా రకరకాల వంటల్లో నిమ్మ వాడేస్తుంటాం
TV9 Telugu
వేసవిలో నిమ్మ రసాన్ని తాగడమంటే చాలా మందికి ఇష్టం. సి విటమిన్ అందించే వాటిల్లో మొదటి స్థానంలో ఉండేది కూడా నిమ్మే
TV9 Telugu
అంతేకాదూ నిమ్మ తీసుకుంటే ఎ, ఇ, బీ6, విటమిన్లూ ఇనుము, రాగి, మెగ్నీషియం, క్యాల్షియం, రైబోఫ్లావిన్, జింక్ వంటివీ శరీరానికి అందుతాయి. వీటిలోని పోషకాల కారణంగా ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు
మరిన్ని వెబ్ స్టోరీస్
తళతళ తమలపాకుతో పసందైన ఆరోగ్యం.. అతిచేస్తే క్యాన్సర్ పక్కా!
జ్వరం వచ్చినప్పుడు కాఫీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ముఖానికి కొబ్బరి నూనె రాస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసుకోండి