Vizag Tourism: సముద్రంలో సరదాగా విహరించేందుకు వేదికైన వైజాగ్.. పర్యాటక సేవలు ప్రారంభం ఎప్పుడంటే..
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం పోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో 100 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను మార్చిలో వినియోగంలోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్రూయిజ్ షిప్‌లను నడిపే ఆర్గనైజేషన్స్ చాలా అడ్వాన్స్‌గా వాళ్ళ రూట్లను ఖరారు చేసుకుంటాయి. కొన్ని సందర్బాలలో మూడేళ్లకు ముందుగానే ప్లాన్ చేసుకుని ఆమేరకు ఆయా రూట్లలో షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి.

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తోంది. ఇప్పటికే విశాఖపట్నం పోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తో 100 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్‌ను మార్చిలో వినియోగంలోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. క్రూయిజ్ షిప్‌లను నడిపే ఆర్గనైజేషన్స్ చాలా అడ్వాన్స్‌గా వాళ్ళ రూట్లను ఖరారు చేసుకుంటాయి. కొన్ని సందర్బాలలో మూడేళ్లకు ముందుగానే ప్లాన్ చేసుకుని ఆమేరకు ఆయా రూట్లలో షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. దాంతో టికెట్ల బుకింగ్ కూడా పూర్తవుతుంది. కొత్త రూట్లలో వెంటనే క్రూయిజ్‌లను నడపడం అంత సాధ్యం కాదు. అందులోనూ విశాఖలో అంతర్జాతీయ టెర్మినల్ నిర్మాణం ఆలస్యం కావడంతో ఈ రూట్‌ను షెడ్యూల్ చేసుకున్న సంస్థలు కూడా తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి. కార్డిలియా లాంటి సంస్థలు ముందుకు వచ్చినా సకాలంలో టెర్మినల్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో వేరే రూట్లకు వెళ్లిపోయాయి.
తాజాగా అంతర్జాతీయ స్థాయిలో క్రూయిజ్ టెర్మినల్ పూర్తి కావడంతో విశాఖపట్నం నుంచి అండమాన్ వరకు, అక్కడి నుంచి దక్షిణ ఆసియా దేశాలైన థాయ్‌ల్యాండ్, మలేషియా, సింగపూర్‌లకు క్రూయిజ్ షిప్‌లను నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు విశాఖ పోర్ట్ చైర్మన్ అంగ ముత్తు. చెన్నై, పూరీ, కోల్‌కతాలను కలుపుతూ ఒక టూరిస్ట్ సర్క్యూట్ ను కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉందనీ ఆయన వివరించారు. మార్చి నుంచి చెన్నై-విశాఖపట్నం-కొలంబో మధ్య ఒక విలాసవంతమైన క్రూయిజ్ నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
పలు క్రూయిజ్ సంస్థలతో ఎంఓయూలు
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఓ క్రూయిజ్ టూరిజం సంస్థ ఎంఓయూ కుదుర్చుకోవడంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రూయిజ్ టూరిజం మార్చిలో విశాఖపట్నం నుంచి ప్రారంభం కానుంది. లిట్టోరల్ క్రూయిస్ లిమిటెడ్ తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కంపెనీ వైజాగ్, వైజాగ్-చెన్నై-శ్రీలంక, చెన్నై-సింగపూర్‌కు సర్వీసులను నడుపనుంది. అదే సమయంలో మాల్దీవులకు కూడా సేవలను అందించనున్నట్టు కంపెనీ వివరించింది.
1200 కోట్ల పెట్టుబడి
సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియాలకు సర్వీసులను నడపడానికి 1200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు లిట్టోరల్ క్రూయిస్ లిమిటెడ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించి అమలు చేయడం ప్రారంభించింది. వైజాగ్ పోర్టు ఇప్పటికే 100 కోట్లతో వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్-విఐసిటీ ని పోర్టులోని ఔటర్ హార్బర్‌లోని ఛానల్ బెర్త్‌లో నిర్మించింది. దానిని గత ఏడాది సెప్టెంబర్ 5న షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ అట్టహాసంగా ప్రారంభించారు. అయినా ఇప్పటి వరకు ఒక్క క్రూయిజ్ కూడా రాలేదు. సుదూర ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు తూర్పు తీరంలో వెంబడి నిర్మించిన మొదటి క్రూయిజ్ టెర్మినల్ విశాఖలోనే ఉంది. ఇది 50,000 నుండి ఒక లక్ష మెట్రిక్ టన్నుల వరకు పనామా నౌకల వంటి పెద్ద నౌకలకూ వసతి కల్పిస్తుంది.
ఒక్కో ట్రిప్‌లో 2000 నుండి 2500 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగల సామర్థ్యం ఉంటుంది. క్రూయిజ్‌లు వైజాగ్‌లోని 330 మీటర్ల పొడవైన క్రూయిజ్ బెర్త్‌లో బెర్త్ చేయవచ్చు. వీఐసీటీ ప్యాసింజర్ లాంజ్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, రిక్రియేషన్ ఏరియా, రెస్ట్‌రూమ్‌లు, డ్యూటీ-ఫ్రీ షాపులు, కరెన్సీ మార్పిడి కౌంటర్లు టెర్మినల్ భవనంలో ఉన్నాయి. లిట్టోరల్ క్రూయిస్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ఎంఓయూ కుదిరిందని, మార్చి నాటికి టెర్మినల్ పని చేస్తుందని వైజాగ్ పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎ అంగముత్తు వివరించారు. ఈ క్రూయిజ్ టూరిజంతో ప్రపంచ పర్యాటక పటంలో వైజాగ్ సముచిత స్థానం పొందుతుందని చైర్మన్ అంగముత్తు భావిస్తు్న్నారు. క్రూయిజ్ టూరిజం ప్రారంభం తర్వాత విశాఖ అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








